బ్లింకిట్ ‘డార్క్ స్టోర్’ ఆహార లైసెన్స్ రద్దు

Published on Tue, 08/11/2026 - 12:21

వేగవంతమైన డెలివరీల పేరుతో క్విక్-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ బ్లింకిట్‌కు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) గట్టి షాక్ ఇచ్చింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ పరిధిలో ఉన్న బ్లింకిట్ డార్క్ స్టోర్‌లో తీవ్రమైన పారిశుధ్య లోపాలు, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ఆ స్టోర్ లైసెన్స్‌ను (లైసెన్స్ సంఖ్య: 11524010000119) సస్పెండ్ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.

తనిఖీల్లో వెలుగుచూసిన ఘోరాలు

ఎఫ్‌డీఏ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. స్టోర్‌లోని పండ్లు, కూరగాయల విభాగంలో పెద్ద ఎత్తున బొద్దింకల సంచారం, తుప్పు పట్టిన రాక్‌లపై, నేరుగా నేలపై ఆహార పదార్థాల పొట్లాలను నిల్వ ఉంచడం అధికారుల దృష్టికి వచ్చింది. కోల్డ్ స్టోరేజ్ విభాగాన్ని ఏమాత్రం శుభ్రపరచకపోవడమే కాకుండా, గడువు తీరిన (ఎక్స్‌పైర్డ్), దెబ్బతిన్న ఆహార ఉత్పత్తులు ప్యాకింగ్ నిల్వల్లో ఉండటం గమనార్హం. ఆహార నిర్వహణలో పాటించాల్సిన ఫస్ట్-ఇన్ ఫస్ట్-అవుట్/ ఫస్ట్-ఎక్స్‌పైరీ, ఫస్ట్-అవుట్ పద్ధతులను పూర్తిగా విస్మరించారని ఎఫ్‌డీఏ తన నివేదికలో తెలిపింది. ఎలుకలు, కీటకాల నివారణ చర్యలు శూన్యమని స్పష్టం చేసింది.

సిబ్బంది ఆరోగ్యంపై నిర్లక్ష్యం

ఆహారాన్ని నిర్వహించే సిబ్బందికి సంబంధించి ఎలాంటి ఉచిత వైద్య తనిఖీలు లేదా ఆరోగ్య రికార్డులు అందుబాటులో లేవని, వారి వ్యక్తిగత పరిశుభ్రత కూడా అధ్వానంగా ఉందని తనిఖీల్లో తేలింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 (FSS Act) సెక్షన్ 32(3) ప్రకారం ఈ సస్పెన్షన్ వేటు వేశారు. ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం ఈ ఫెసిలిటీ నుంచి ఎలాంటి ఆహార విక్రయాలు లేదా పంపిణీ చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.

వినియోగదారుల ఆరోగ్యం ప్రశ్నార్థకం

10 నిమిషాల డెలివరీ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు బ్యాక్ ఎండ్‌లో కనీస పారిశుధ్యాన్ని కూడా విస్మరించడం వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడటమే. సేవల్లో వేగం ఎంత ముఖ్యమో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల నిర్వహణ అంతకంటే ముఖ్యమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)