Breaking News

బిట్‌ కాయిన్‌ దారుణ పతనం.. ఎందుకు?

Published on Wed, 11/05/2025 - 15:59

ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ (Bitcoin) విలువ దారుణంగా పతనమైంది. గత కొన్ని నెలలుగా దూసుకెళ్లిన ఈ క్రిప్టో ఒక్కసారిగా క్రాష్‌ అయింది. మంగళవారం (నవంబర్‌ 4) లక్ష డాలర్ల మార్కు దిగువకు పడిపోయింది. క్రిప్టో మార్కెట్ విస్తృత క్షీణత కారణంగా 7.4 శాతం పడిపోయి ఐదు నెలల కనిష్ట స్థాయి 96,794 (రూ.85.83 లక్షలు) డాలర్ల వద్దకు వచ్చింది.

ఇటీవల జోరుమీదున్న బిట్‌ కాయిన్‌ సరిగ్గా నెల క్రితం అక్టోబర్ 6న రికార్డు స్థాయిలో 126,000 డాలర్లను తాకింది. అక్కడి నుంచి తాజాగా 20% కంటే పైగా పతనమైంది. గత జూన్ తర్వాత బిట్‌ కాయిన్‌ లక్ష డాలర్ల మార్కు దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి.

క్రిప్టో క్రాష్‌..

బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈక్విటీలలో బేర్ మార్కెట్ నేపథ్యంలో క్రిప్టో మార్కెట్‌ కూడా పతనం దిశలో పయనిస్తోంది. బిట్‌ కాయిన్‌ మాత్రమే కాకుండా పెద్దగా ట్రేడ్‌ కాని ఇతర క్రిప్టో కాయిన్‌లు ఇలాంటి క్షీణతలనే నమోదు చేశాయి. 50% పైగా నష్టాలను తెచ్చాయి. ఈథర్ మంగళవారం 15% వరకు పడిపోయింది.

కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ (CoinMarketCap) డేటా ప్రకారం.. గత నెలలో ప్రపంచ క్రిప్టో మార్కెట్ మొత్తం మార్కెట్ విలువలో సుమారు 840 బిలియన్‌ డాలర్లను కోల్పోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్‌ల యుద్ధం కొత్త మలుపు తీసుకోవడంతో అక్టోబర్‌లో బిట్ కాయిన్ చెత్త పనితీరును నమోదు చేసింది.

బిట్‌కాయిన్‌ పతనానికి కారణాలు

బిట్‌కాయిన్‌ తాజా పతనానికి అనేక ఆర్థిక, రాజకీయ, మార్కెట్ సంబంధిత అంశాలు కారణమయ్యాయి.

  • అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండటతో ఇన్వెస్టర్లు క్రిప్టో వంటి రిస్కీ అసెట్‌లపై పెట్టుబడులను తగ్గించి సురక్షిత పెట్టుబడులవైపు మొగ్గు చూపుతున్నారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం అంటే డాలర్‌ బలంగా ఉండడం. దాంతో బిట్‌కాయిన్‌ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులకు ఆకర్షణ తగ్గుతుంది.

  • అక్టోబర్‌ నెలలో క్రిప్టో మార్కెట్‌లో బిలియన్ల డాలర్ల బుల్లిష్‌ పొజిషన్లు లిక్విడేట్‌ అయ్యాయి. ఈ ఒత్తిడి అమ్మకాల కారణంగా ధర మరింత వేగంగా పడిపోయింది.

  • బ్లూమ్‌బెర్గ్‌ ప్రకారం, స్టాక్‌ మార్కెట్‌లలో బేర్‌ ట్రెండ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో క్రిప్టో మార్కెట్‌ కూడా అదే దిశలో కదిలింది. ఇన్వెస్టర్లు “రిస్క్‌ ఆఫ్‌” మూడ్‌లో ఉండటంతో బిట్‌కాయిన్‌ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సుంకాల యుద్ధానికి కొత్త మలుపు ఇవ్వడంతో మార్కెట్‌ అనిశ్చితి పెరిగింది. ట్రేడింగ్‌ వాల్యూమ్‌ తగ్గిపోవడం, మదుపరులు వేచి చూడే ధోరణి అవలంబించడం బిట్‌కాయిన్‌ విలువను దెబ్బతీసింది.

  • ఇటీవల క్రిప్టో ఆధారిత ఎక్స్ఛేంజ్‌-ట్రేడెడ్‌ ఫండ్‌ల (ETFs) నుండి నిధులు వెనక్కు మళ్లాయి. భారీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ ఫండ్‌ల ద్వారా క్రిప్టోలోకి పెట్టుబడులు తగ్గించడం, మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరచింది.

  • కొన్ని డిజిటల్‌ అసెట్‌ ట్రెజరీ సంస్థలు తమ బిట్‌కాయిన్‌ నిల్వలను అమ్మే అవకాశం ఉందని ఊహించడంతో మార్కెట్‌లో భయం పెరిగింది. దీని ఫలితంగా ధర మరింత ఒత్తిడికి గురైంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)