తాగునీటిలో బ్రోమేట్.. కుకీస్‌లో నిషేధిత రంగులు!

Published on Mon, 11/23/2026 - 08:25

మనలో చాలామంది బిస్లెరి అంటే.. స్వచ్ఛమైన తాగునీరు అని నమ్ముతాం. అందుకే ప్రయాణాల్లోనైనా, బయటకు వెళ్లినప్పుడైనా బిస్లెరి వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాం. అయితే.. తాజాగా బిస్లెరి సంస్థకు సంబంధించిన తాగునీటి నమూనాల్లో కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో బయటపడటం చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించే సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఈ విషయంపై బిస్లెరి ఇంటర్నేషనల్‌పై చర్యలు ప్రారంభించింది.

అసలు విషయానికి వస్తే.. బిస్లెరి సంస్థకు చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాను అధికారులు సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ పరీక్షలో నీటిలో బ్రోమేట్ అనే రసాయనం అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ నీటిని తాగడానికి సురక్షితం కాదని అధికారులు ప్రకటించారు.

సురక్షితం కాదని తేల్చిన ల్యాబ్
అయితే.. ఈ నిర్ణయంపై బిస్లెరి సంస్థ అప్పీల్ చేసుకుంది. దీంతో.. అదే నమూనాను మరో రిఫరల్ ల్యాబ్‌కు పంపించి మళ్లీ పరీక్షించారు. కానీ రెండో పరీక్షలో కూడా నీరు సురక్షితం కాదని తేలింది. ఈసారి నీటిలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనే రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు.

రెండు ల్యాబ్‌ల పరీక్షల్లోనూ లోపాలు బయటపడటంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 ప్రకారం.. బిస్లెరి సంస్థపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. అంటే.. సంస్థపై చట్టపరమైన విచారణ కోసం కేసు ప్రారంభించే ప్రక్రియకు అనుమతి ఇచ్చిందన్నమాట.

చాక్లెట్ ఫిల్లింగ్ కుకీస్‌
ఇదే సమయంలో.. మరో సంస్థ అయిన ఆశా కన్ఫెక్షనరీ తయారుచేసిన చాక్లెట్ ఫిల్లింగ్ కుకీస్‌పై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకుంది. ఆ కుకీస్‌ను ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు లేబుల్‌పై పేర్కొనని కార్మోసిన్ అనే రంగు పదార్థం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. టార్ట్రజైన్ అనే రంగును అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినట్లు తేలింది. వీటితో పాటు సన్‌సెట్ ఎల్లో ఎఫ్సీఎఫ్ అనే రంగు పదార్థాన్ని కూడా గుర్తించారు. అయితే ఆ నిర్దిష్ట ఆహార వర్గంలో ఈ రంగును ఉపయోగించడానికి అనుమతి లేదు.

దీంతో ఆ కుకీస్‌ను నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధమైనవి, తప్పుదారి పట్టించే లేబులింగ్ కలిగినవి, అసురక్షితమైనవిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకటించింది. అంతేకాకుండా మార్కెట్లో ఉన్న సంబంధిత బ్యాచ్ ఉత్పత్తులన్నింటినీ వెంటనే వెనక్కి తీసుకోవాలని సంస్థను ఆదేశించింది.

ఈ రెండు ఘటనలను గమనిస్తే.. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనం నమ్మకంతో కొనుగోలు చేసే ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు కూడా నాణ్యతా పరీక్షలకు అతీతం కావు. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఆహార ఉత్పత్తులను తయారుచేసే కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అదే సమయంలో వినియోగదారులుగా మనం కూడా ప్యాకింగ్‌పై ఉన్న వివరాలు, తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల జాబితాను పరిశీలించే అలవాటు చేసుకోవాలి.

ఇదీ చదవండి: కంగారు పెడుతున్న బంగారం.. త్రీ-డైమెన్షన్‌ స్టోరీ!

Videos

నామినేషన్లు అయ్యాక పవన్ ప్రకటన ఎందుకు?

పెద్దారెడ్డి హత్యకు జేసీ ఫ్యామిలీ మాస్టర్ స్కెచ్..!

బంగారం రూ.లక్షకేనా? గోల్డ్ రేట్లకు అమెరికా షాక్!

పవన్ గారూ.. ఇదేం పరిస్థితి? జనసేనను చంపేస్తున్నారు..!

అనంతపురం మేయర్ గా రమేష్ గౌడ్ ప్రమాణస్వీకారం

మహేష్ అందానికి ఫిదా అయిపోయా..!

జనసేన 7 కోట్ల స్కామ్ వెనుక పెద్ద తలకాయలు

షర్మిల గారి డ్రామా ఫెయిల్.. బెంగుళూరు ధర్నాపై కారుమూరి రియాక్షన్

కూటమితో పోలీసులు చేతులు కలిపారు: పిన్నెల్లి

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

Photos

+5

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా 'రికార్డ్' ప్రారంభం (ఫోటోలు)

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)