Breaking News

పేరులో చిన్న మార్పు: పతనమైన బీర్ల కంపెనీ!

Published on Sat, 10/11/2025 - 16:49

విజయవంతంగా.. లాభాలను గడిస్తూ దూసుకెళ్తున్న కంపెనీ, బ్రాండ్ పేరులోని చిన్న పదాన్ని తొలగించడం వల్ల ఊహకందని నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. వినడానికి ఈ మాట కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

గత దశాబ్దంలో విజయవంతమైన స్టార్టప్ సంస్థల్లో బిరా 91 ఒకటి. ఇది ఒక ప్రసిద్ధ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్. 2023 చివరలో ఈ కంపెనీ ఐపీఓ కోసం సిద్ధమైంది. అయితే లిస్టింగ్ నిబంధనలను పాటించడానికి.. బీ9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిరా 91 మాతృ సంస్థ) నుంచి ప్రైవేట్ అనే పదాన్ని తొలగించి.. బీ9 బెవరేజెస్ లిమిటెడ్‌గా పేరు మార్చుకుంది. దీని కోసం 2024 జనవరిలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద పేరును మార్చుకుంది. ఈ చర్య కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోయేలా చేసేసింది.

కంపెనీ కొత్త పేరుతో తెరమీదకు రావడంతో.. అన్ని రాష్ట్రాల్లో బిరా 91 అమ్మకాలను చాలామంది నిషేధించారు. దీనికి కారణం కొత్త పేరు.. పాత కంపెనీదే అని నమ్మకపోవడం. అమ్మకం దారులు ప్రతి ఒక్క వేరియంట్‌కు కొత్త చట్టపరమైన ఆమోదాలు, లేబుల్ ఆమోదాలు, ఉత్పత్తి రిజిస్ట్రేషన్లు, కొత్త లైసెన్స్‌లను డిమాండ్ చేశారు. వీటిని జారీ చేయడంలో అధికారిక జాప్యం కోలుకోలేని దెబ్బ కొట్టింది.

ఒకదాని తర్వాత ఒకటి సమస్యలకు దారితీసింది. దీంతో పంపిణీ మొత్తం ఆగిపోయింది. కోట్ల విలువైన ఉత్పత్తి.. గిడ్డంగుల్లోనే ఉండిపోయింది. మొత్తం మీద కంపెనీ రూ. 700 కోట్ల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇందులో పెట్టుబడిపెట్టడానికి వచ్చిన సంస్థలు కూడా వెనుకడుగు వేశాయి.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌