Breaking News

Bimal Dayal: అదానీ కంపెనీకి కొత్త సీఈవో

Published on Sat, 12/09/2023 - 15:40

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సీఈఓగా బిమల్ దయాల్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ట్రాన్స్‌మిషన్ బిజినెస్ చీఫ్‌గా ఉన్నారు. పీటీఐ వార్తా సంస్థ నివేదికల ప్రకారం ఈ నిర్ణయాన్ని ఏఈఎస్‌ఎల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.

అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకు సంబంధించిన  థర్మల్‌, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును బిమల్‌ దయాల్ పర్యవేక్షిస్తారని అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది . 

అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాన్ని సంవత్సరానికి 15 శాతానికిపైగా పెంచాలన్న సంకల్పాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నియామకం ద్వారా మరో ముఖ్యమైన అడుగు వేసినట్లు కంపెనీ తెలిపింది.\

 

దేశంలో అతిపెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాబోయే 10 సంవత్సరాల్లో  రూ. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని పోర్ట్‌ఫోలియో ఇటీవల ప్రణాళికను ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది.

బిమల్‌ పటేల్‌ నియామకం నేపథ్యంలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ప్రస్తుత మేనేజ్‌మెంట్‌ బృందంలోని  మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా, కంపెనీ అన్ని విభాగాలను చూసుకునే కందర్ప్ పటేల్‌  ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, స్మార్ట్ మీటర్ విభాగాలను నడిపిస్తారని పీటీఐ కథనం పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)