Breaking News

ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్

Published on Wed, 08/16/2023 - 17:02

భారతీయ సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'గౌతమ్ సింఘానియా' (Gautam Singhania) గత కొన్ని రోజులకు ముందు రూ. 4 కోట్లు విలువైన 'మసెరటి ఎమ్‌సీ20' కూపే కొనుగోలు చేశారు. అయితే ఈ కారు మీద ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

బహుశా నా జీవితంలో నేను నడిపిన చెత్త కారు మసెరటి ఎమ్‌సీ20. మసెరటి కారును కొనుగోలు చేసే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అంటూ గౌతమ్ సింఘానియా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

నిజానికి మనదేశంలో చాలా మంది ప్రముఖులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో మసెరటి బ్రాండ్ ఒకటి. ఇది 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి 630 హార్స్ పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ.

ఇదీ చదవండి: అకౌంట్‌లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు

వేగంలో కూడా అద్భుతమైన పనితీరుని కనపరిచే ఈ కారుని ఎందుకు గౌతమ్ సింఘానియా ఇలా అన్నారు, బహుశా ఈయన వద్ద ఉన్న ఇతర కార్ల కంటే బహుశా ఇదే తక్కువ పనితీరుని కనపరించిందా, లేదా ఇంకేమైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇతని వద్ద రూ. 6.37 కోట్ల విలువైన ఫెరారీ 296 జీటీబీ సూపర్‌కార్‌, లంబోర్ఘిని, పోర్స్చే, ఆస్టన్ మార్టిన్, రోల్స్ రాయిస్ వంటి హై ఎండ్ మోడల్ కార్లు ఎన్నో ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇలాంటి మోసాలు జరుగుతున్నాయ్! ఆదమరిస్తే అకౌంట్‌లో డబ్బు మాయం!

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)