90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ
Breaking News
'పని ఇష్టం లేనప్పుడే.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్'
Published on Thu, 04/23/2026 - 21:22
గత కొన్నేళ్లుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బూప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈవో 'ఇనాకీ ఎరెనో' తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇనాకీ ఎరెనో ప్రకారం.. జెన్ జీ తరానికి చెందిన యువత ఎక్కువగా పని ఒత్తిడిని తగ్గించుకుని, వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం, కుటుంబ సమయం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కొంతమంది పెద్ద వ్యాపార నాయకులు ఈ ఆలోచనతో ఏకీభవించడం లేదు.
ఒక ఉద్యోగి తరచుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అని ఆలోచిస్తే.. అది ఆ ఉద్యోగం తనకు సరిపడటం లేదని అర్థం. ఒక వ్యక్తి తన పనిని నిజంగా ఇష్టపడితే, పని - జీవితం మధ్య కఠినమైన సరిహద్దులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని ఎరెనో పేర్కొన్నారు.
ఎరెనో తన అనుభవాన్ని కూడా ఉదాహరణగా చెప్పారు. ఆయన ఒక పెద్ద కంపెనీని నిర్వహిస్తున్నప్పటికీ.. వీకెండ్స్‌లో నా కుమారుడితో కలిసి జిమ్‌కు వెళ్తున్నప్పుడు కూడా వ్యాపార ఆలోచనలు చేయడం, ఈమెయిల్స్ చూడడం వంటివి తనకు ఒత్తిడిగా అనిపించదని చెప్పారు. తన పనిని ఆనందంగా చేసుకుంటే, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన భారంగా చూడాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయం. తమకు నచ్చిన పని ఎంచుకుంటేనే పని–జీవిత సమతుల్యత అనే సమస్యే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక స్కేల్ ఏఐ కో-ఫౌండర్ లూసీ గువో (Lucy Guo) కూడా ఇదే తరహా అభిప్రాయం చెప్పారు. పని–జీవిత సమతుల్యత అవసరం అనిపిస్తే, ఆ ఉద్యోగం సరైనది కాకపోవచ్చు అని అన్నారు. తాను తన పనిని ఎంతో ఇష్టపడతానని, అందుకే అలాంటి సమస్య ఎదురుకాదని చెప్పారు.
Tags : 1