Breaking News

వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్‌గేట్స్‌

Published on Mon, 12/25/2023 - 10:53

వారాంతపు సెలవులు తీసుకుని, పని చేయకుండా ఉండటం తనకు నచ్చేది కాదని మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంపెనీ ప్రారంభించిన తొలినాళ్లలో తనకు వారాంతపు సెలవులు తీసుకోవడం ఇష్టం ఉండేది కాదని, పని చేయకుండా ఖాళీగా ఉండడం తనకు నచ్చేది కాదని ఆయన తెలిపారు. కానీ తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందని బిల్ గేట్స్ తన బ్లాగ్‌లో రాశారు. 

పని కంటే జీవితం గొప్పదని, ఎంతో విలువైందని గ్రహించినట్లు ఆయన పేర్కొన్నారు. తన పిల్లల వయసులో ఉన్నప్పుడు తనకు సెలవులపై ఆసక్తి ఉండేది కాదన్నారు. తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందన్నారు. తన పిల్లల ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందని బిల్‌గేట్స్‌ చెప్పారు. గోల్‌కీపర్స్ ఈవెంట్‌లో చిన్న కుమార్తె ఫోబ్‌తో తాను వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

ఇదీ చదవండి: అప్పు ప్రమాదఘంటికలివే..

ఈ ఏడాది ప్రారంభంలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ‘జీవితాన్ని ఆస్వాదించటం కూడా మరచిపోయేలా కష్టపడొద్దు. పనికంటే జీవితం ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత సమయం వెచ్చించండి’ అని ఆయన విద్యార్థులకు సూచించిన విషయం తెలిసిందే.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌