పారిస్‌ ఒలింపిక్స్‌లో బిల్‌గేట్స్‌ అల్లుడు..

Published on Sat, 07/27/2024 - 19:10

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వ క్రీడా పోటీలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పోటీలపై అందరికన్నా ఉత్సాహంగా ఉంది మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ కుటుంబం. కారణం ఆయన అల్లుడు ఈ పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడుతుండటం.

బిల్ గేట్స్ అల్లుడు, నాయెల్ నాసర్ ఈజిప్ట్ దేశం తరఫున ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పోటీ పడుతున్నారు. నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. మెలిందా, బిల్ గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ఒలింపిక్స్‌ పాల్గొంటున్న తన అల్లుడిని ఉత్సాహపరుస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో మెలిందా ఫ్రెంచ్ గేట్స్ మద్దతు తెలియజేశారు.

నాసర్ ప్రొఫెషనల్ ఈక్వెస్ట్రియన్. అంతర్జాతీయ పోటీలలో ఈజిప్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపిక్ అథ్లెట్. ఈజిప్షియన్ తల్లిదండ్రులకు చికాగోలో జన్మించారు. కువైట్‌లో పెరిగారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు.  ఐదు సంవత్సరాల వయస్సు నుంచే గుర్రపు స్వారీ పట్ల మక్కువ పెంచుకున్న నాసర్ అనేక ప్రపంచ ఈవెంట్లలో పాల్గొన్నారు. బిల్, మెలిందా గేట్స్‌ల పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. వీరికో పాపాయి కూడా పుట్టింది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)