Breaking News

న్యూ ఇయర్‌‌లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు

Published on Sun, 01/07/2024 - 20:52

గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్‌‌లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కవాసకి జెడ్ఎక్స్-6ఆర్
కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

కవాసకి ఎలిమినేటర్ 500
ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది.

ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే?

బజాజ్ చేతక్ ప్రీమియం
ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్‌డేట్‌లు, నోటిఫికేషన్ అలర్ట్‌ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు.

ఏథర్ 450 అపెక్స్
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)