Breaking News

కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్‌

Published on Tue, 05/21/2024 - 12:19

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)లో పికప్ లేన్‌ల ప్రవేశ రుసుమును రద్దుచేస్తూ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(బీఐఏఎల్‌) ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పింది.

అవసరం ఉన్నా, లేకపోయినా కేఐఏ పికప్‌లేన్‌ పరిధిలోకి పెద్దసంఖ్యలో వాహనాలు వస్తూండడం బీఐఏఎల్‌ దృష్టికి వెళ్లింది. దాంతోపాటు ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో భారీగా వాహనాలు చేరుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించింది. వాటిని నివారించాలంటే కొన్ని మార్పులు తీసుకురావాలని భావించింది. బీఐఏఎల్‌ టెర్మినల్‌ 1, 2లో అరైవల్ పికప్ లేన్‌లను చేరడానికి ఎంట్రీ ఫీజును ప్రవేశ పెట్టింది. రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా వాహనాలపై ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ట్యాక్సీడ్రైవర్లు, ఇతర కమ్యునిటీల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రవేశ రుసుమును రద్దుచేస్తున్నట్లు బీఏఐఎల్‌ తిరిగి ప్రకటన విడుదల చేసింది.

బీఐఏఎల్‌ ముందుగా చేసిన ప్రకటన ప్రకారం..ప్రైవేట్ వాహనాలు పికప్ లేన్‌లలోకి ప్రవేశించిన ఏడు నుంచి 14 నిమిషాల సమయానికి రూ.150 రుసుము చెల్లించాలి. వాణిజ్య వాహనదారులు మొదటి ఏడు నిమిషాలకు రూ.150, తర్వాతి ఏడు నిమిషాలకు రూ.300 చెల్లించాలి. బస్సు ప్రయాణికులు ఏడు నిమిషాలకు రూ.600, ట్రావెలర్స్‌ రూ.300 చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ టికెట్‌పోతే రూ.600 నిర్ణీత రుసుము చెల్లించాలి. పికప్ ఏరియాలో 15 నిమిషాలకు మించి ఉంటే ఆ వాహనాలను యజమాని ఖర్చుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలి.

వైట్‌ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ కలిగి ఉండే వాహనాలను  ప్రైవేట్ వాహనాలుగా, ట్రావెల్స్‌, ఆన్‌లైన్‌ బుకింగ్‌ వెహికిల్స్‌, పసుపు రిజిస్ట్రేషన్ ప్లేట్‌తోపాటు కొన్ని ఈవీలను వాణిజ్య వాహనాలుగా వర్గీకరించారు. కర్ణాటక రాష్ట్ర ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ హోల్లా  మాట్లాడుతూ..‘ఎయిర్‌పోర్ట్‌ రావాలనుకునే ప్రయాణికులు ఇప్పటికే సాదహళ్లి టోల్‌గేట్ వద్ద ఛార్జీ చెల్లిస్తున్నారు. మళ్లీ అరైవల్‌-పికప్‌ ఏరియాలో రుసుము చెల్లించాలనే నిర్ణయం సరికాదు’ అన్నారు.

కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు నిబంధనల కంటే వేగంగా వెళ్లే వారిని గుర్తించి జరిమానాలను విధిస్తాయి.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)