సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
Breaking News
భీమ్ యాప్లో మరిన్ని ఆర్థిక సేవలు
Published on Thu, 06/25/2026 - 02:25
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెల్లింపుల సేవలకు సంబంధించిన భీమ్ పేమెంట్స్ యాప్లో మరిన్ని ఆర్థిక సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు ఎన్బీఎస్ఎల్ (ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్) ఎండీ లలిత నటరాజ్ తెలిపారు. ఆర్థిక సంస్థలతో కలి సి రుణాలు, పింఛను పథకాలు, బీమా, పెట్టుబడి సాధనాలు మొదలైనవి ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నట్లు ఆమె వివరించారు.
గడిచిన 12 నెలల్లో యాప్ ద్వారా లావాదేవీల పరిమాణం మూడు రెట్లు పెరిగినట్లు బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో లలిత చెప్పా రు. గతేడాది జూన్లో 7.96 కోట్లుగా ఉన్న నెలవారీ వాల్యూ మ్స్ ఈ ఏడాది మే నాటికి 2.44 కోట్లకు చేరినట్లు చెప్పారు. మే నెలలో రూ. 26,952 కోట్ల విలువైన లావాదేవీలను ప్లాట్ఫాం ప్రాసెస్ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో, భీమ్ యాప్ ద్వారా జరిగిన మర్చంట్ లావాదేవీల్లో 23.9% వాటాతో నిత్యావసరాలు అగ్రస్థానంలో ఉండగా ఫుడ్ ఔట్లెట్స్ (18.1%), క్విక్ కామర్స్ (11.6%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Tags : 1