Breaking News

UPI: ఇదిగో యాప్‌.. యాడ్‌ చేశా.. ఖర్చు పెట్టుకోండి!

Published on Wed, 11/26/2025 - 14:27

మనం ఖర్చు పెట్టుకోవడానికి ఇంట్లో పెద్దవారు కానీ, యజమానులు కానీ నగదు కాకుండా బ్లాంక్‌ చెక్‌లు ఇచ్చేవాళ్లు. ఆ తర్వాత క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు ‘ఇదిగో యాప్‌.. ఖర్చు పెట్టుకోండి’ అని ఇచ్చే పరిస్థితి వచ్చింది.

ఎన్‌పీసీఐ అనుబంధ సంస్థ అయిన ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (NBSL).. తన భీమ్ పేమెంట్స్ యాప్ లో ‘యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్’ ఫీచర్‌ను ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు లేదా కావాల్సినవారిని సర్కిల్‌లోకి తీసుకుని మన అకౌంట్‌ నుంచి వాళ్లు డబ్బులు వాడుకునేలా చేయొచ్చు. నెలకు ఇంత అని రూ .15,000 వరకు ప్రీసెట్ చేస్తే ఇక వారు తమకు కావాల్సినప్పుడల్లా సలువుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు వారికి సొంత యూపీఐ-లింక్డ్ బ్యాంక్ ఖాతా కూడా అవసరం లేదు. ఇలా ఎన్నికాలం వాడుకోవచ్చు (1 నెల నుండి 5 సంవత్సరాల వరకు) అన్నది కూడా సెట్‌ చేయొచ్చు.

ఎన్‌బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలిత నటరాజ్ మాట్లాడుతూ, ఈ ఫీచర్ సామాన్య కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తమ ఆర్థిక కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని, డిజిటల్ చెల్లింపులను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు.

యూపీఐ సర్కిల్‌ను ఎలా ఉపయోగించాలంటే..

  • భీమ్ యాప్‌లోకి వెళ్లి యూపీఐ సర్కిల్ ఓపెన్‌ చేయండి.

  • 'ఇన్వైట్‌ టు సర్కిల్‌'ను ఎంచుకుని కాంటాక్ట్ ని యాడ్‌ చేయండి.

  • వారి యూపీఐ ఐడీని ఎంటర్ చేయండి లేదా క్యూఆర్ స్కాన్ చేయండి.

  • 'అప్రూవ్‌ ఎ మంత్లీ లిమిట్‌'ను ఎంచుకోండి

  • రిలేషన్ షిప్ సెట్ చేసి గుర్తింపును (ఆధార్/ఇతర డాక్యుమెంట్ లు) వెరిఫై చేయండి

  • ఖర్చు పరిమితి (రూ.15,000 వరకు), వ్యాలిడిటీ (1 నెల నుంచి 5 సంవత్సరాలు) సెట్ చేయండి.

  • ఖాతాను ఎంచుకుని యూపీఐ పిన్‌తో ప్రమాణీకరించండి.

  • ఇప్పుడు అవతలివారు అంగీకరించిన తర్వాత కొద్దిసేవటికి చెల్లింపులను ప్రారంభించవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)