Breaking News

ఎయిర్‌టెల్‌ లాభం హైజంప్‌

Published on Wed, 05/14/2025 - 04:22

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5 రెట్లు జంప్‌చేసి రూ. 11,022 కోట్లను తాకింది.  వన్‌టైమ్‌ పన్ను లబ్ధి, టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపాయి. కొన్ని పన్నుసంబంధిత అంశాలలో రూ. 5,913 కోట్లు అందుకుంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 2,072 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 27% ఎగసి రూ. 47,876 కోట్లను అధిగమించింది.

అంతక్రితం క్యూ4లో రూ. 37,599 కోట్ల టర్నోవర్‌ సాధించింది. దేశీ(స్టాండెలోన్‌) ఆదాయం 29% జంప్‌చేసి రూ. 36,735 కోట్లయ్యింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 17% మెరుగుపడి రూ. 245ను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 209గా నమోదైంది. 66 లక్షల మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు జత కలసినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు. దేశీ యూ జర్ల సంఖ్య 42.4 కోట్లకు చేరింది.  15 దేశాలలో విస్తరించిన కార్యకలాపాల ద్వారా 59 కోట్ల మంది యూజర్లున్నారు. డేటా కస్టమర్ల సంఖ్య 77%కి చేరింది. సగటున నెలకు మొబైల్‌ డేటా వినియోగం 21% ఎగసి 25.1 జీబీని తాకింది. 

పూర్తి ఏడాదికి సైతం  
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్‌టెల్‌ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 33,556 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 7,467 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా పుంజుకుని రూ. 1,72,985 కోట్లను తాకింది. 2023–24లో రూ. 1,49,982 కోట్ల టర్నోవర్‌  మాత్రమే నమోదైంది. నికర రుణ భారం రూ. 1.94 లక్షల కోట్ల నుంచి రూ. 2.03 లక్షల కోట్లకు పెరిగింది. క్యూ4లో పెట్టుబడి వ్యయాలు రూ. 12,553 కోట్ల నుంచి రూ. 14,401 కోట్లకు ఎగశాయి. అదనంగా 3,300 టవర్లను ఏర్పాటు చేసింది. పూర్తి ఏడాదికి పెట్టుబడి వ్యయాలు రూ. 33,242 కోట్లుగా నమోదయ్యాయి.

ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు బీఎస్‌ఈలో 3 శాతం నష్టంతో రూ. 1,821 వద్ద ముగిసింది. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)