Breaking News

ఎయిర్‌టెల్‌ వీక్‌ సిగ్నల్‌

Published on Fri, 02/06/2026 - 03:51

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 55 శాతం పడిపోయి రూ. 6,631 కోట్లకు పరిమితమైంది. నెట్‌వర్క్‌ నిర్వహణ వ్యయాలతోపాటు, ఉద్యోగ వ్యయాల  పెరుగుదల, ప్రభుత్వ ఫీజులు ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 14,781 కోట్లు ఆర్జించింది. 

మొత్తం ఆదాయం మాత్రం 20 శాతం జంప్‌చేసి రూ. 53,982 కోట్లను తాకింది. గత క్యూ3లో కేవలం రూ. 45,129 కోట్ల టర్నోవర్‌ సాధించింది. దీనిలో దేశీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 39,226 కోట్లయ్యింది. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు 28 శాతం ఎగసి రూ. 11,787 కోట్లకు చేరగా.. వీటిలో దేశీ వాటా 16 శాతం అధికంగా రూ. 9,250 కోట్లకు చేరింది. లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రమ్‌ చార్జీలు 7 శాతం పెరిగి రూ. 3,846 కోట్లయ్యాయి. ఉద్యోగ వ్యయాలు సైతం 12 శాతం అధికమై రూ. 1,958 కోట్లను తాకాయి. 

కస్టమర్ల సంఖ్య అప్‌ 
తాజా సమీక్షా కాలంలో ఎయిర్‌టెల్‌ ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 5.7 శాతం మెరుగుపడి రూ. 259ను తాకింది. కస్టమర్ల సంఖ్య 12 శాతం వృద్ధితో 57.6 కోట్లకు చేరింది. దేశీయంగా ఇది 13 శాతం పుంజుకుని 41.38 కోట్లకు చేరగా.. ఆఫ్రికాలో 10 శాతం బలపడి 17.93 కోట్లుగా నమోదైంది.  
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు బీఎస్‌ఈలో 1.7 శాతం బలహీనపడి రూ. 1,992 వద్ద ముగిసింది.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)