BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్‌ 

Published on Thu, 05/11/2023 - 15:31

సాక్షి,ముంబై: పేమెంట్స్ యాప్ భారత్‌ పే ఫౌండర్‌, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్‌ వివాదంలో అష్నీర్‌కు మరోసారి  చుక్కెదురైంది. భారత్‌పే టాప్‌ లీడర్‌షిప్‌ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత, తాజాగా మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో గ్రోవర్‌తోపాటు  ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్‌టెక్ యునికార్న్‌ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్‌ఐఆర్‌లో  పేర్కొంది. 

గత ఏడాది ఫిన్‌టెక్ యునికార్న్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా  అష్నీర్ గ్రోవర్ ,  కుటుంబ సభ్యులపై ఆర్థిక నేరాల విభాగం (EOW)  ఫిర్యాదు  దాఖలు చేసింది. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్,  ఆమె సోదరులు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది.

ఆర్థిక నేరాల విభాగం ఆరోపణలు
86 నకిలీ, తప్పుడు ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి  గ్రోవర్, ఇతర నిందితులు రూ.7.6 కోట్ల మేర అక్రమాలకు  పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానంగాఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించింది. అంతేకాదు సాక్ష్యాలను మాధురీ జైన్ నాశనం చేశారని ఆరోపించింది. త్వరలోనే నిందితులందరినీ  అరెస్టు చేసే అవకాశం  ఉందని అంచనా. మరోవైపు నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా  పదేళ్ల దాకా జైలు శిక్ష  ఖరారు కానుందని  తెలుస్తోంది.  

కాగా  2022, జనవరిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్‌ను మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రోవర్, అతని కుటుంబ సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివిధ సెక్షన్ల ద్వారా నిందితులందరి నుండి రూ. 88 కోట్ల నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని కంపెనీ కోరింది. భారత్‌పే ఫౌండర్‌ ట్యాగ్‌ని ఉపయోగించకుండా నిరోధించాలంటూ సింగపూర్‌లో కూడా దావా వేసింది. అయితే తాజా పరిణామంపై  అష్నీర్‌ గ్రోవర్‌ అధికారికంగా  స్పందించాల్సి ఉంది. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)