Breaking News

ఐఫోన్ లాంటి కెమెరా కోసం.. ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవే..

Published on Sat, 02/15/2025 - 19:33

కొందరు ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్స్ ఇష్టపడతారు, మరికొందరు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్స్ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇంకొందరు హై క్వాలిటీ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్స్ కోసం ఎగబడతారు. ఈ కథనంలో ఐఫోన్ లాంటి కెమెరా కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.

ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో (Oppo Find X8 Pro)
అద్భుతమైన కెమెరా కలిగిన ఫోన్ల జాబితాలో.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఒకటి. క్వాడ్-కెమెరా సెటప్‌ కలిగిన ఈ ఫోన్‌లో 1 ఇంచ్ సోనీ LYT-900 ప్రైమరీ సెన్సార్, 6x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మాక్రో కెపాసిటీతో అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.82 ఇంచెస్ ProXDR OLED డిస్‌ప్లే పొందుతుంది. దీని ధర ఎక్కువే అయినప్పటికీ.. మంచి కెమెరా కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పాలి.

నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a)
ఈ ఫోన్ ఇంకా మార్కెట్లో లాంచ్ కాలేదు. కానీ టీజర్‌లోనే కెమెరా క్వాలిటీ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, 6.7 ఇంచెస్ AMOLED డిస్‌ప్లే ఉండనున్నాయి. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే.. దీని ధర కొంత తక్కువగానే ఉంటుందని సమాచారం.

నుబియా జెడ్70 అల్ట్రా (Nubia Z70 Ultra)
అత్యుత్తమ కెమెరా సెటప్ కలిగిన స్మార్ట్‌ఫోన్ల జాబితాలో.. నుబియా జెడ్70 అల్ట్రా ఒకటి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 35 మీమీ సమానమైన లెన్స్‌తో వస్తుంది. కాబట్టి యూజర్లకు మంచి కెమెరా ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. విభిన్న ఫోటోగ్రఫీ అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ పనికొస్తుంది. దీని ధర కూడా కొంత ఎక్కువే.

లావా అగ్ని 3 (Lava Agni 3)
లావా అగ్ని 3 మొబైల్ కూడా.. మంచి కెమెరా సెటప్ పొందుతుంది. ఇది OISతో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ వంటివి పొందుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. 6.78 ఇంచెస్ 120 Hz డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్ 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)