ఒక్క ఈఎంఐతో ఐదేళ్లు ఆదా!

Published on Tue, 10/22/2024 - 10:32

సొంతిల్లు సామాన్యుడి కల. దీన్ని నెరవేర్చుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అందుకోసం డబ్బు పోగు చేస్తారు. కొంత నగదు సమకూరిన తర్వాత హోంలోన్‌ తీసుకుని ఇంటిని సొంతం చేసుకుంటారు. నెలవారీ ఈఎంఐల కోసం తిరిగి కష్టపడుతుంటారు. అయితే ఈ లోన్‌ వ్యవధి సుమారు 25 ఏళ్లపాటు ఉంటుంది. దాంతో భారీగా వడ్డీ చెల్లించాలి. ఆలోపు అనుకోకుండా ఏదైనా డబ్బు అవసరం ఏర్పడితే ఈఎంఐలకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ లోన్‌ కాలపరిమితిని తగ్గించుకుంటే త్వరగా అప్పు తీర్చడంతోపాటు ఇతర ఖర్చులకు డబ్బును సమకూర్చుకోవచ్చు. అయితే త్వరగా ఇంటి రుణం ఎలా చెల్లించాలో తెలుసుకుందాం.

  • ఉద్యోగం చేస్తున్నవారు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుకున్నప్పుడు అందుకు అనుగుణంగా వేతనం పెరుగుతుంది. అలా పెరిగిన డబ్బుతో ఏటా 10 శాతం ఈఎంఐ పెంచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించండి. దీనివల్ల 25 ఏళ్ల కాలానికి తీసుకున్న రుణం.. 10 ఏళ్లలోనే పూర్తవుతుంది.

  • ఏటా 10 శాతం ఈఎంఐ పెంచడం కష్టం అని భావించేవారు తమ ఇంటి రుణాన్ని 13 ఏళ్లలో తీర్చవచ్చు. ఇందుకోసం నెలవారీ వాయిదాను ఏటా ఐదు శాతం వరకు పెంచుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఖర్చుల విషయంలోనూ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే సమయంలో రుణంపై వడ్డీ భారమూ తగ్గుతుంది.

  • ఏటా 12 ఈఎంఐలకు బదులుగా కేవలం ఒక ఈఎంఐని అధికంగా చెల్లిస్తే మీ ఇంటిరుణం వ్యవధి ఏకంగా ఐదేళ్లు తగ్గుతుంది. అంటే 25 ఏళ్ల పాటు సాగే రుణ భారాన్ని 20 ఏళ్లలోనే పూర్తి చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం

  • నెలవారీ సంపాదనలో అన్ని ఈఎంఐలు కలిపి 50 శాతానికి మించకూడదు. ఒకవేళ ఈ పరిధిదాటితే ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

  • సొంతింటిలో అదనంగా ఫ్లోర్లు ఏర్పాటు చేసి గదులు కిరాయికి ఇవ్వొచ్చు. అలా వచ్చే రెంట్‌తో ఈఎంఐ పెంచుకోవచ్చు. దాంతో తక్కువ సమయంలోనే లోన్‌ పూర్తి చేయవచ్చు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)