Breaking News

మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..

Published on Fri, 01/24/2025 - 16:42

ప్రపంచం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. ఆడపిల్లల విషయంలో మాత్రం ఇంకా అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టకూడదని కోరుకునే తల్లిదండ్రులు లేకపోలేదు. చదువు, పెళ్లి ఇలాంటివన్నీ భారమనుకునేవారు నేటికీ ఉన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలి. ఆడబిడ్డలను కూడా అన్ని రంగాల్లో ఎగదనివ్వాలి. దీనిని దృష్టిలో ఉంచుకునికి, బాలికలను ప్రోత్సహించడానికి.. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఆడపిల్ల పుడితే.. భారమనుకునే ఆలోచన మారాలి. మగపిల్లలు మాత్రమే కాకుండా.. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ తమ ముద్ర వేస్తున్నారు. కాబట్టి వారి ఎదుగుదలకు ఉపయోగపడే కొన్ని పథకాలు గురించి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి.

సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ స్కీమ్ కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల కోసం సంరక్షులు లేదా తల్లిదండ్రులు.. అమ్మాయి పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి ఖాతాను 250 రూపాయలతో ప్రారభించవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 1.50 లక్షలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్‌ను సందర్శించి ప్రారభించవచ్చు.

చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్
చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. పిల్లల వివాహం, ఉన్నత విద్య మొదలైన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గిఫ్ట్ ఫండ్‌లు.. డెట్ అండ్ ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్‌ల కలయికలో పెట్టే పెట్టుబడి.

ఎల్ఐసీ జీవన్ తరుణ్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ 'జీవన్ తరుణ్ స్కీమ్' అందిస్తుంది. దీనిని ప్రత్యేకంగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య పిల్లల విద్యకు ఆర్ధిక సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అంతే కాకుండా చదువుకునే సమయంలో విద్యా అవసరాలకు చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా మెచ్యూరిటీ సమయంలో మొత్తం కవరేజ్ లభిస్తుంది.

బాలికా సమృద్ధి యోజన (BSY)
భారతదేశంలో ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల బాలికల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బాలికా సమృద్ధి యోజన స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద, ఆడపిల్ల పుట్టినప్పుడు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఆ తర్వాత వారు ఉన్నత పాఠశాల వరకు విద్యను పొందేలా చూసేందుకు వార్షిక స్కాలర్‌షిప్‌లను సైతం అందించడం జరుగుతుంది.

సీబీఎస్ఈ ఉడాన్ పథకం
సీబీఎస్ఈ ఉడాన్ స్కీమును భారత ప్రభుత్వ మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) సహకారంతో 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్' (CBSE) ప్రారంభించింది. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో మహిళా విద్యార్థుల నమోదు రేటును పెంచడం దీని లక్ష్యం.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు