Breaking News

లాభదాయకతకు దగ్గర్లో బైజూస్‌

Published on Fri, 06/30/2023 - 02:18

న్యూఢిల్లీ: ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ నెమ్మదిగా, స్థిరంగా వృద్ధి చెందుతోందని సంస్థ సీఈవో బైజూ రవీంద్రన్‌ తెలిపారు. గ్రూప్‌ స్థాయిలో లాభదాయకతకు చాలా దగ్గర్లోనే ఉన్నామని ఆయన చెప్పారు. బైజూస్‌ వృద్ధి, భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితిపై ఆందోళనలను తొలగించేందుకు నిర్వహించిన టౌన్‌హాల్‌ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రవీంద్రన్‌ ఈ విషయాలు తెలిపారు.

1.2 బిలియన్‌ డాలర్ల టర్మ్‌ లోన్‌ బీ (టీఎల్‌బీ) రుణదాతలతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరికొన్ని వారాల్లోనే సానుకూల ఫలితం రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అంతర్జాతీయంగా టెక్‌ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ బైజూస్‌ మాత్రం లాభదాయకత లక్ష్యాల దిశగా గణనీయంగా పురోగతి సాధించిందని రవీంద్రన్‌ చెప్పారు.బైజూస్‌ ఆర్థిక పని తీరు, రుణ భారం, ఆర్థిక ఫలితాలను ప్రకటించడంలో జాప్యాలు, కంపెనీ వేల్యుయేషన్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ప్రోసస్‌ 6 బిలియన్‌ డాలర్లకు కుదించడం తదితర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో రవీంద్రన్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)