Breaking News

సూపర్ స్టైలిష్ బైకులు.. కాలేజ్ స్టూడెంట్స్ కోసం!

Published on Mon, 12/16/2024 - 19:48

భారతదేశంలో లాంగ్ రైడ్ చేయడానికి, రోజువారీ ప్రయాణానికి, మహిళలు కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం.. ఇలా వివిధ రకాల టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్లకు అనువైన ఐదు బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.

యమహా ఎంటీ-15
యమహా అంటే ముందగా గుర్తొచ్చేది స్టైల్. కాబట్టి ఇవి యువతను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటాయి. కాలేజ్ స్టూడెంట్లు బాగా ఇష్టపడే యమహా బైకులలో ఒకటి.. ఏంటీ-15. రూ.1.78 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.

కేటీఎం 125 డ్యూక్
యువత ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బైకులతో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ బ్రాండ్ కేటీఎం. ఈ కంపెనీకి చెందిన 125 డ్యూక్ కాలేజ్ విద్యార్థులకు కూడా మొదటి ఎంపిక. దీని ధర రూ.1.78 లక్షలు. ఈ బైకులో 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200
రూ.1.40 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్200' బైక్ కూడా కాలేజ్ స్టూడెంట్లకు నచ్చిన బైకులలో ఒకటి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అందించే ఈ బైకును స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు మాత్రమే. ఇది స్టైలిష్ స్ట్రీట్ బైక్. ఇందులో 349.34 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 Bhp, 27 Nm టార్క్ అందిస్తుంది.

ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్
రూ. 96,781 ప్రారంభ ధర వద్ద లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన 'ఎక్స్‌ట్రీమ్ 125ఆర్'. ఇందులోని 124.7 సీసీ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి స్టైలిష్‌గా కనిపించే ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)