Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Published on Fri, 04/19/2024 - 14:30

జర్మనీకి చెందిన స్కైట్రాక్స్‌ ఏటా ఇచ్చే ‘బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ ఇన్‌ ఇండియా అండ్‌ దక్షిణాసియా 2024’ అవార్డు ఈ ఏడాదికిగాను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను వరించింది. బుధవారం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ప్యాసింజర్‌ టర్మినల్‌ ఎక్స్‌పో-2024లో ఈమేరకు ప్రకటన వెలువడినట్లు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(ఆర్‌జీఐఏ) సీఈవో ప్రదీప్‌ పణికర్‌ తెలిపారు.

విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగుల పనితీరు, స్నేహ పూర్వకంగా ఉండే విధానం, సమర్థత, సిబ్బంది చురుకుగా వ్యవహరించడం, సమాచార కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్‌, భద్రతా అధికారులు,  సెక్యూరిటీ స్టాఫ్‌, షాప్స్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజస్‌ అవుట్‌లెట్లలో స్టాఫ్‌ పనితీరు మెరుగ్గావుండటం వంటి  వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపికచేస్తారు.

ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్‌.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌కు గతేడాది స్కైట్రాక్స్ ఫోర్‌స్టార్‌ రేటింగ్‌ను ఇచ్చింది. ఈఏడాది ఏకంగా ప్రముఖ అవార్డుకు ఎంపిక చేయడంపట్ల ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయం న్యూదిల్లీలో యాక్‌రెక్స్‌(ACREX) హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)