Breaking News

బెంజ్, కియా కార్ల ధరలు పెంపు

Published on Wed, 03/19/2025 - 08:33

లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మరోసారి కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. యూరో మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగితే ఏప్రిల్‌ నుంచి తమ మోడల్‌ కార్ల ధరలను పెంచే వీలుందని కంపెనీ ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. ‘యూరో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90 స్థాయి వద్ద ఉన్నప్పుడు కార్ల ధరలు నిర్ణయించాం. ఇప్పుడు యూరో 95 స్థాయికి చేరుకుంది. గణనీయంగా పెరిగిన మారకపు విలువ ఏప్రిల్‌ నుంచి కార్ల ధరల పెంపునకు దారి తీయోచ్చు’ అన్నారు.

ఇప్పటికే ఈ జనవరిలో మెర్సిడెస్‌  కార్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. టెస్లా రాకపై అయ్యర్‌ స్పందిస్తూ.. కొత్త సంస్థ రాక ఎప్పుడూ మార్కెట్‌ వృద్ధికి తోడ్పడుతుంది. డిమాండ్‌ పెంచే సంస్థలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా రికార్డు స్థాయిలో 19,565 కార్లు విక్రయించింది. అంతకు ముందు ఏడాది(2023)లో 17,408 యూనిట్లను అమ్మింది.

ఇదీ చదవండి: పూనావాలా ఫిన్‌ వాణిజ్య వాహన రుణాలు

అదే బాటలో కియా ఇండియా

కియా ఇండియా సైతం కారు ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. అధిక కమోడిటీ ధరలు, ఇన్‌పుట్‌ వ్యయాలు, సప్లై సంబంధిత ఖర్చుల కారణంగా అన్ని మోడళ్ల వాహన ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘‘పెరిగిన వ్యయ భారం కస్టమర్లపై పడకుండా ఉండేందుకు వీలైనంత వరకు ప్రయత్నం చేసినప్పటికీ.. కొంత భారాన్ని మాత్రం కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తోంది. అని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలిపారు.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)