Breaking News

బెంగళూరు వద్దు బాబోయ్‌.. ఆఫీస్‌ తరలిస్తున్న టెకీ..

Published on Sat, 05/24/2025 - 09:35

దేశ ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో తరచూ భాష వివాదాలు రేగుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న భాషా నేపథ్యాలున్న వారు అక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలవారికి బెంగళూరులో స్థానికుల నుంచి భాషాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ టెక్ ఫౌండర్ తన కంపెనీ కార్యాలయాన్ని పుణెకు తరలించాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు కౌశిక్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్‌ ఇటీవల చెలరేగిన భాష వివాదంపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. భాష వివాదాలతో కన్నడ మాట్లాడలేని తమ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడని, అందుకే బెంగళూరులోని తమ కంపెనీ కార్యాలయాన్ని పుణె తరలించనున్నట్లు తెలిపారు. తమ ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, వారి అభిప్రాయాలతో తానూ ఏకీభవిస్తున్నానని చెప్పారు.

‘బెంగళూరులోని మా కార్యాలయాన్ని ఆరు నెలల్లో మూసేసి పుణెకు తరలించాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నా. భాష వివాదాలు ఇలాగే  కొనసాగుతుంటే కన్నడ మాట్లాడలేని మా ఉద్యోగులు బాధితులు కావడం నాకు ఇష్టం లేదు. ఈ ఆలోచన ఉద్యోగుల ఆందోళల నుంచే వచ్చింది. వారి అభిప్రాయాలతో నేను ఏకీభవించాను’ అంటూ కౌశిక్ ముఖర్జీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో రాసుకొచ్చారు.

బెంగళూరులోని చందాపుర ప్రాంతంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఇటీవల మేనేజర్‌కు, కస్టమర్‌కు మధ్య భాషా వివాదం తలెత్తింది. మేనేజర్‌ కన్నడలో మాట్లాడేందుకు నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కన్నడ సంఘాలు, రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. మేనేజర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదంటూ బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వీడియోను షేర్ చేయగా కౌశిక్ ముఖర్జీ దానికి స్పందిస్తూ పోస్ట్‌ చేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)