Breaking News

లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!

Published on Mon, 03/16/2026 - 13:29

బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.

తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్‌ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.

వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 
ఇంటి అద్దె: ఆఫీస్‌కు  సమీపంలోని చిన్న అపార్ట్‌మెంట్‌కు సుమారు రూ.36,000
కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000
ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్‌లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000
ఇతర ఖర్చులు: ఆన్‌లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000

ఇవి కాకుండా సబ్‌స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.

ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియాలో భిన్న స్పందనలు
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ  వేలల్లో వ్యూస్‌, వందలాది లైక్‌లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్‌ కామెంట్‌ చేశారు. 

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)