బ్యాంకులో 14 ఏళ్లు ఎక్స్‌పీరియన్స్‌.. రోడ్డుపై బిచ్చగాడిలా..

Published on Mon, 09/01/2025 - 13:23

పైన ఫొటోలో మీరు చూస్తున్న వ్యక్తికి బ్యాంకింగ్‌ రంగంలో 14 ఏళ్ల అనుభవం ఉందట. కానీ ప్రస్తుతం నిలువ నీడ లేకుండా, చేతిలో చిల్ల గవ్వ లేకుండా రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్నాడు.  ప్రొఫెషనల్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడ్డిట్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇది జాబ్‌ మార్కెట్‌, సామాజిక పరిస్థితులపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.

రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న ఆ వ్యక్తి ఫొటోలను షేర్ చేస్తూ, ఒక రెడ్డిటర్ ఇలా రాసుకొచ్చారు..‘ఈ వ్యక్తిని ఒక ప్రముఖ బెంగళూరు సిగ్నల్ వద్ద చూశాను. ఆయనను చూస్తే ఎంతో హృదయవిదారకంగా ఉంది.  ఇది సమాజ వైఫల్యమా లేక వ్యక్తిగత నిర్ణయాల ఫలితమా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను.’

రెడ్డిటర్ షేర్‌ చేసిన ఫొటోల్లో మొదటి దాంట్లో  ఆ వ్యక్తిని రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై బిచ్చగాడిలా కనిపించారు. రెండో ఫొటోలో ఆ వ్యక్తి చేతిలో ఉన్న నోట్‌ను చూపించారు. అందులో  'నాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, దయచేసి సహాయం చేయండి. నాకు బ్యాంకింగ్ లో 14 ఏళ్ల అనుభవం ఉంది’ అని రాసిఉంది.

ఈ పోస్ట్‌పై రెడ్డిటర్స్ మధ్య చర్చ సాగింది. బెంగళూరు వంటి నగరంలో నిరుద్యోగం ఏంటి అని కొందరు ప్రశ్నించారు.  అయితే అతని శారీరక వైకల్యం ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 'శారీరకంగా సామర్థ్యం ఉంటే డెలివరీ లేదా డ్రైవింగ్ వంటి ఏదో ఒక పని చేసుకోవచ్చని చాలా మంది చెబుతుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉంటే, మానసికంగా విచ్ఛిన్నమై, నిరాశకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)