Breaking News

ఉద్యోగ సంక్షోభం.. రియల్టీ మార్కెట్‌పై భారం

Published on Tue, 03/18/2025 - 15:03

భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొంది. 2024లో 50,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులను తొలగించడం నగర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. వ్యయ నియంత్రణ చర్యలు, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ను వేగంగా అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంపై ప్రభావం చూపడమే కాకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆందోళనలు రేకెత్తిస్తున్నట్లు ఇన్‌షార్ట్స్‌ నివేదిక తెలిపింది.

సంక్షోభంలో ఐటీ రంగం

బెంగళూరు ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఐటీ పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎంట్రీ లెవల్ ప్రోగ్రామర్లు, స్టాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌లో భాగంగా ఉన్న కోడింగ్, డీబగ్గింగ్ వంటి పనుల కోసం ఉన్న సాఫ్ట్‌వేర్‌ టెస్టర్ల స్థానంలో కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ మార్పు వల్ల అనేక ఉద్యోగాలు తొలగింపునకు కారణమవుతుంది. దాంతో వేలాది మంది వృత్తి నిపుణులు నిరుద్యోగులుగా మారుతున్నారు. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి అందిస్తున్న వారు స్థానికంగా ఉద్యోగులు ఖాళీ చేస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

రియల్ ఎస్టేట్‌పై ప్రభావం

ఉద్యోగులు తొలగింపులు బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. బడ్జెట్ హౌసింగ్‌కు డిమాండ్ గణనీయంగా తగ్గడంతో భూయజమానులు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు జూనియర్ ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండే పీజీ సౌకర్యాలు ఇప్పుడు తక్కువ ఆక్యుపెన్సీ రేటుతో సతమతమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వంటి టెక్నాలజీ హబ్‌ల సమీపంలో అద్దె ప్రాపర్టీల్లోకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ఇన్వెస్టర్లు ప్రాపర్టీ విలువలు పడిపోవడం, యూనిట్లు ఖాళీగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి: యూఎస్‌ మాజీ అధ్యక్షుడి సంతకం కాపీ..?

విస్తృత ఆర్థిక ప్రభావాలు

ఉద్యోగ సంక్షోభం ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలతోపాటు ఇతర విభాగాలకు విస్తరించింది. నగరంలోని ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుంది. రెస్టారెంట్లు, కేఫ్‌లు, రిటైల్ స్టోర్లు వంటి ఐటీ నిపుణులకు సేవలందించే స్థానిక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొత్త కొలువు కోసం ఎదురుచేసే తొలగించిన ఉద్యోగుల వ్యయ శక్తి తగ్గడం బెంగళూరులోని వివిధ పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు