Breaking News

పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!

Published on Tue, 11/05/2024 - 12:32

కుమారుడికి పెళ్లి కూతురుని వెతకడంలో విఫలమైన ఓ మ్యాట్రిమోనీ కంపెనీపై తండ్రి కోర్టుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపించిన కోర్టు కుమారుడి తండ్రికి రూ.60,000 చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ తండ్రి, కంపెనీ మధ్య ఎలాంటి వివాదం ఉందో, దీనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రమోషన్‌ ఆధారంగా కుమార్‌ అనే వ్యక్తి దిల్‌మిల్‌ అనే మ్యాట్రిమోనీ కంపెనీను మార్చిలో ఆశ్రయించాడు. తన కుమారుడు బాలాజీకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు పెళ్లి కూతురును వెతికే బాధ్యతను కంపెనీకి అప్పగించాడు. సంస్థ అందుకు నెల రోజుల సమయం విధించింది. ప్రతిగా ఇనిషియల్‌ పేమెంట్‌ ఛార్జీల కింద కుమార్‌ నుంచి రూ.30,000 వసూలు చేసింది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం నెల తర్వాత కుమార్‌ వెళ్లి వివరాలు అడిగితే కంపెనీ స్పందించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ తర్వాత కూడా తనకు పెళ్లికుతురి వివరాలు పంపలేదు. దాంతో మే నెలలో కళ్యాణ్ నగర్‌లోని దిల్‌మిల్‌ మ్యాట్రిమోనీ కంపెనీకి కుమార్ లీగల్ నోటీసులు పంపాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించలేదు. దాంతో బెంగళూరు వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్‌ బైంక్‌ లాంచ్‌ చేసిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

అక్టోబరు 28న న్యాయస్థానం దిల్‌మిల్‌ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్‌కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్‌ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని స్పష్టం చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)