Breaking News

ఐదేళ్లలో రద్దు చేసిన రుణాలు రూ. 9.9 లక్షల కోట్లు

Published on Wed, 08/07/2024 - 04:31

న్యూఢిల్లీ: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 9.90 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్‌ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. 2019–20లో అత్యధికంగా రూ. 2.34 లక్షల కోట్లు రైటాఫ్‌ చేయగా ఆ తర్వాత సంవత్సరంలో ఇది రూ. 2.02 లక్షల కోట్లకు, 2021–22లో రూ. 1.74 లక్షల కోట్లకు తగ్గింది. తర్వాత సంవత్సరంలో ఇది తిరిగి రూ. 2.08 లక్షల కోట్లకు పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరం రూ. 1.70 లక్షల కోట్లకు పరిమితమైంది.

రైటాఫ్‌ చేసినంత మాత్రాన బాకీలను పూర్తిగా రద్దు చేసి రుణగ్రహీతలకు మేలు చేసినట్లు కాదని, వారు వాటిని చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. బ్యాలెన్స్‌ షీట్‌ను మెరుగుపర్చుకునేందుకు, పన్ను ప్రయోజనాలు పొందేందుకు, మూలధనాన్ని మెరుగ్గా ఉపయోగించుకునేందుకు నిర్దిష్ట నిబంధనలకు లోబడి బ్యాంకులు మొండి బాకీలను రైటాఫ్‌ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని రాబట్టేందుకు బ్యాంకుల చర్యలు కొనసాగుతాయని తెలిపారు. గత అయిదేళ్లలో రూ. 1.84 లక్షల కోట్లు రికవర్‌ అయినట్లు మంత్రి చెప్పారు.

#

Tags : 1

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)