Breaking News

బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో 12 రోజులు బంద్‌!

Published on Mon, 04/29/2024 - 07:51

Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.

దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్‌లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.

మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) 
మే 5: ఆదివారం.
మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకుల బంద్
మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయ
మే 11: రెండో శనివారం
మే 12: ఆదివారం.
మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు
మే 19: ఆదివారం.
మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల  మూత
మే 23: బుద్ధ పూర్ణిమ 
మే 25: నాలుగో శనివారం. 
మే 26: ఆదివారం.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)