Breaking News

బ్యాంకుల్లో రూ .78,213 కోట్లు.. ఎవరిదీకానిది ఈ సొమ్ము!

Published on Thu, 05/30/2024 - 18:28

దేశంలోని వివిధ బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. బ్యాంకుల వద్ద ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు 2024 మార్చి చివరి నాటికి 26 శాతం పెరిగి రూ .78,213 కోట్లకు చేరుకున్నాయి.

సహకార బ్యాంకులతో సహా వివిధ బ్యాంకుల్లో 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాల్లోని సొమ్మును అన్‌క్లెయిమ్డ్‌గా పరిగణించి  ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ నిధికి బదిలీ చేస్తాయి. ఇలా 2023 మార్చి నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌లో ఉన్న మొత్తం రూ.62,225 కోట్లు.

ఖాతాదారులకు సహాయపడటానికి మరియు ఇన్‌యాక్టివ్ ఖాతాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను క్రమబద్ధీకరించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది ప్రారంభంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాలు, డిపాజిట్లను ఇన్ యాక్టివ్ లేదా అన్ క్లెయిమ్డ్ గా వర్గీకరించడంతోపాటు బ్యాంకులు అమలు చేయాల్సిన చర్యలను ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు.

నవీకరించిన మార్గదర్శకాలు అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా), సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లను కేంద్రీకృత పద్ధతిలో వెతికే ప్రక్రియను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఉడ్గామ్ (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్) అనే వెబ్ పోర్టల్‌ను రూపొందించింది.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)