Breaking News

బ్యాంక్ హాలిడేస్: ఐదు రోజుల్లో నాలుగు రోజులు సెలవు!

Published on Thu, 03/26/2026 - 17:46

మార్చి నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇది ఆర్ధిక లావాదేవీలు జరిపేవాళ్లకు కొంత నిరాశను కలిగించింది. ఆర్థిక లావాదేవీల పరంగా ఎంతో కీలకమైన మార్చినెలలో ఇలా వరుస సెలవులు రావడం వల్ల ఏదైనా పెండింగ్ పడే అవకాశం ఉందేమో అని చాలామంది భావిస్తున్నారు.

➤మార్చి 27:శ్రీరామనవమి కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రత్యేకించి మిజోరం,మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు,ఉత్తరాఖాండ్,రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్,చంఢీఘర్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్,ముంబై, నాగ్‌పూర్,జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.

➤ మార్చి 28: నాలుగో శనివారం సాధారణ సెలవుదినం కావడంతో, భారతదేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.

➤ మార్చి 29: ఆదివారం సెలవుదినం కావడంతో.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి.

➤ మార్చి 31: మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు.

అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

Videos

కడప స్టీల్ పై బాబు నాటకం

సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్

ఓటమిని ఒప్పుకోండి.. మాతో మీరు గెలవడం కల్లా..

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Photos

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)