Breaking News

బ్యాంక్‌ ఖాతాకు ఇక నలుగురు నామినీలు

Published on Fri, 10/24/2025 - 04:47

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఖాతాదారులు, డిపాజిటర్లు ఇకపై నలుగురు వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. బ్యాంకింగ్‌ సవరణ చట్టం, 2025ను ఈ ఏడాది ఏప్రిల్‌ 15న నోటిఫై చేయగా, నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో మొత్తం 19 సవరణలు చేశారు. వీటి ప్రకారం బ్యాంక్‌ ఖాతాదారులు ఒకేసారి నలుగురిని నామినీగా (ప్రతినిధి/నియమితుడు) నమోదు చేసుకోవచ్చు. 

ఖాతాదారుడు/డిపాజిటర్‌ మరణానంతరం క్లెయిమ్‌ సమయంలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది నిర్దేశించొచ్చు. ఒకే విడత నలుగురు లేదంటే ఒకరి తర్వాత ఒకరి నామినీ అమల్లోకి వచ్చేలా (సక్సెసివ్‌) ప్రతిపాదించొచ్చు. సేఫ్టీ లాకర్లలో ఉంచిన వస్తువులకు సంబంధించి ఒకే విడత నలుగురిని కాకుండా, ఒకరి తర్వాత ఒకరి నామినీ అమల్లోకి వచ్చేలా నమోదు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అంటే మొదటి నామినీ మరణించిన తర్వాతే రెండో నామినీ అమల్లోకి వస్తుంది.

 ఒక్కరినే నామినీగా ప్రతిపాదించిన సందర్భాల్లో, సదరు వ్యక్తి కూడా అందుబాటులో లేకపోతే క్లెయిమ్‌ పరంగా ఇబ్బందులు రాకుండా ఈ సవరణ తీసుకొచి్చనట్టు తెలుస్తోంది. ‘‘ఈ కొత్త నిబంధనల అమలుతో నామినేషన్ల విషయంలో డిపాజిటర్లకు సౌలభ్యం ఏర్పడుతుంది. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా నామినీలను ప్రతిపాదించొచ్చు. దీనివల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థ అంతటా క్లెయిమ్‌ల పరిష్కారాల విషయంలో పారదర్శకత, ఏకరూపత, సమర్థత నెలకొంటుంది’’అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది.  

బ్యాంకుల్లో పాలన పటిష్టం 
బ్యాంకింగ్‌ రంగంలో పాలనా ప్రమాణాలను పటిష్టం చేయడం, ఆర్‌బీఐకి వెల్లడించే సమాచారం విషయంలో ఏకరూపత, డిపాజిటర్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల రక్షణ, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఆడిట్‌ నాణ్యత పెంచడం, నామినీ సదుపాయం పరంగా కస్టమర్లకు సౌకర్యవంతమైన సేవలు అందించే లక్ష్యాలతో బ్యాంకింగ్‌ చట్టంలో సవరణలను కేంద్రం ప్రతిపాదించింది.    

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)