ఈ ఏడాది పబ్లిక్‌కు కనీస వాటా

Published on Sun, 08/31/2025 - 01:03

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధనను అమలు చేయగలమని పీఎస్‌యూ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ, సీఈవో నిధు సక్సేనా పేర్కొన్నారు. ఈ ఏడాది మరోసారి నిధుల సమీకరణ చేపట్టడం ద్వారా నిబంధన అమలుకు తెరతీయనున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ వాటా తగ్గడంతోపాటు.. బ్యాంక్‌ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) మెరుగుపడగలదని ఫిక్కీ, ఐబీఏ నిర్వహించిన 2025 ఎఫ్‌ఐబీఏసీ సందర్భంగా తెలియజేశారు. 

2026 ఆగస్ట్‌1కల్లా పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా కల్పించమంటూ 5 ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. సెబీ నిబంధనలకు అనుగుణంగా జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం పీఎస్‌యూ బ్యాంకులు వచ్చే ఆగస్ట్‌లోగా ప్రభుత్వ వాటాను తగ్గించుకోవలసి ఉంటుంది. తద్వారా పబ్లిక్‌కు కనీస వాటాను సైతం సాధించవలసి ఉంటుంది. 

ప్రస్తుతం ప్రభుత్వం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 79.6 శాతం వాటా కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం రూ. 2,000–2,500 కోట్ల సమీకరణ ద్వారా ప్రభుత్వ వాటాను 75 శాతం దిగువకు చేర్చుకోవచ్చని సక్సేనా వివరించారు. ఇప్పటికే రుణాలు, ఈక్విటీ ద్వారా రూ. 7,500 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్‌ అనుమతి పొందినట్లు ప్రస్తావించారు. గత అక్టోబర్‌లో బ్యాంక్‌ క్విప్‌ ద్వారా రూ. 3,500 కోట్లు సమకూర్చుకుంది. దీంతో పబ్లిక్‌ వాటా 13.5 శాతం నుంచి 20.4 శాతానికి బలపడింది. 
 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)