Breaking News

ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే..!

Published on Mon, 04/01/2024 - 12:56

ఏప్రిల్ 1 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నెలలో వివిధ పండగలు, పర్వదినాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 

గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం లావాదేవీలన్నీ డిజిటలైజ్ అయినా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో బ్యాంకుకు వెళ్లేముందు ఏయే రోజుల్లో వాటికి సెలవులు ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం వివిధ రాష్ట్రాలతో కలిపి బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి.

ఏప్రిల్ 1: వార్షిక బ్యాంకు ఖాతాల క్లోజింగ్ సందర్భంగా దేశమంతా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే చండీగఢ్, సిక్కిం, మిజోరం, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు పని చేస్తాయి.

ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, జుమాత్ ఉల్ విదా సందర్భంగా తెలంగాణ, జమ్ముల్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 9: ఉగాది, తెలుగు సంవత్సరాది, గుడిపడ్వ, సాజిబు నాంగపంబా (చీరావుబా) తొలి నవరాత్రి సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 10: బొహగ్ బిహు, బైశాఖీ, బిజూ ఫెస్టివల్ సందర్భంగా త్రిపుర, అసోం, జమ్ముకశ్మీర్‌ల్లో బ్యాంకులు పని చేయవు.

ఏప్రిల్ 15: బొహగ్ బిగు, హిమాచల్ దినోత్సవం సందర్భంగా అసోం, త్రిపుర, మణిపూర్, జమ్ముకశ్మీర్‌ల్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 16: శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 20: గరియా పూజ పండుగ సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.

ఇదీ చదవండి: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన ధరలు!

ఏప్రిల్ 13న రెండో శనివారం, 27న నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఆదివారాలు కలుపుకుంటే ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది 16 రోజులేనని గమనించాలి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)