Breaking News

బీవోబీ-మైక్రోసాఫ్ట్‌ జెన్ఏఐ హ్యాకథాన్‌.. రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ

Published on Thu, 06/13/2024 - 18:11

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా మైక్రోసాఫ్ట్ సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ)పై దేశవ్యాప్త ఆన్‌లైన్ హ్యాకథాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

బ్యాంక్ నిర్వచించిన నిర్దిష్ట అంశాల్లో జెన్ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పాల్గొనేవారిని ప్రేరేపించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని, హ్యాకథాన్ నుంచి వెలువడే ఉత్తమ ఐడియాలను అమలు చేస్తామని బ్యాంక్ పేర్కొంది.

డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, స్టార్టప్స్, ఫిన్‌టెక్‌లు వ్యక్తిగతంగా లేదా బృందంగా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనవచ్చు. కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఆడిట్ & కాంప్లయన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పర్సనలైజ్డ్ కంటెంట్ జనరేషన్ అనే ఆరు విభాగాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన పరిష్కారాలను కోరుతోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉంటుందని, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి జెన్‌ఏఐ కొత్త మార్గాలను అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఉమ్మడి విజన్ ను పంచుకోవడానికి సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా&దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు.

కంటెస్టెంట్లు https://bobhackathon.com ద్వారా హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు వ్యక్తిగతంగా లేదా టీమ్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కో టీమ్‌లో గరిష్టంగా నలుగురు వ్యక్తులు ఉండొచ్చు. జూన్ 10 నుంచి 30వ తేదీలోపు ఐడియాలను సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన జట్లు ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)