Breaking News

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రీఫండ్‌ కావాలంటే ఇది తప్పనిసరి!

Published on Sun, 06/09/2024 - 09:13

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిఫండ్స్ పొందడానికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌  ఈ-ఫైలింగ్ సైట్లో తమ బ్యాంకు ఖాతాను రీ వ్యాలిడేట్‌ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్ చేసింది. బ్రాంచ్ మార్పులు, ఐఎఫ్ఎస్‌సీ మార్పులు లేదా బ్యాంకు విలీనాల కారణంగా బ్యాంక్ ఖాతా డేటాను అప్డేట్ చేసినప్పుడు రీ వ్యాలిడేషన్ చేయాల్సి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.

ట్యాక్స్‌ పేయర్స్‌ తమ బ్యాంక్‌ అకౌంట్లను రీ వ్యాలిడేషన్‌ చేసుకునేందుకు చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్ లో రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి. రీ వ్యాలిడేషన్‌ చేసే బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరిగా పాన్‌ కార్డుతో లింక్‌ అయి ఉండాలి. అలాగే కొత్త బ్యాంకు ఖాతాను జోడించాలన్నా కూడా ఆ ఖాతాను పాన్‌తో లింక్ చేసి ఉండాలి. యూజర్ కు చెల్లుబాటు అయ్యే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, అకౌంట్‌ నెంబరు ఉండాలి.

ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాను రీవాల్యులేట్ చేయండిలా..
స్టెప్‌ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండి
స్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3 'బ్యాంక్ అకౌంట్' ఎంచుకుని రీవాలిడేట్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4: అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ, ఏసీ టైప్ వంటి బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయండి.
స్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి.

కొత్త బ్యాంకు అకౌంట్‌ను జోడించడానికి..
స్టెప్‌ 1: https://incometax.gov.in/iec/foportal/సందర్శించండి
స్టెప్ 2: లాగిన్ అయ్యి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మై బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయండి (జోడించబడిన, విఫలమైన మరియు తొలగించబడిన బ్యాంక్ అకౌంట్స్ ట్యాబ్ లు డిస్ ప్లే అవుతాయి.)
స్టెప్‌ 4: బ్యాంక్ ఖాతాను జోడించండి
స్టెప్ 5: వాలిడేట్ పై క్లిక్ చేయండి.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)