Breaking News

బంధన్‌ బ్యాంక్‌ లాభం క్షీణత

Published on Sat, 07/15/2023 - 06:11

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం వార్షికంగా 19 శాతం క్షీణించి రూ. 721 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 887 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 2,514 కోట్ల నుంచి రూ. 2,491 కోట్లకు స్వల్పంగా నీరసించింది.

మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,385 కోట్ల నుంచి రూ. 4,908 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.25 శాతం నుంచి 6.76 శాతానికి తగ్గాయి. అయితే నికర ఎన్‌పీఏలు 1.92 శాతం నుంచి 2.18 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 8 శాతం నుంచి 7.3 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 19.44 శాతంగా నమోదైంది. డిపాజిట్లు రూ. 1.08 లక్షల కోట్లను తాకగా.. అడ్వాన్సులు(రుణాలు) రూ. 1.03 లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ వెల్లడించారు.

ఫలితాల నేపథ్యంలో బంధన్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.5 శాతం ఎగసి రూ. 221 వద్ద ముగిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)