Breaking News

బాలెనో ధరల పెంపు

Published on Tue, 02/11/2025 - 11:47

పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య మారుతీ సుజుకి(Maruti Suzuki) తన కార్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ పాపులర్ మోడల్‌ అయిన బాలెనో(Baleno) ధరను పెంచుతున్నట్లు మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. వేరియంట్‌ను అనుసరించి రూ.9,000 ధరలో పెరుగుదల ఉంటుందని స్పష్టం చేసింది. సవరించిన ధరలతో బాలెనో రూ.6.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఇదీ  చదవండి: బంగారం ధర త్వరలో ‘లకారం’! తులం ఎంతంటే..

బాలెనో సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ కారు 88 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎంటీ) లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ)తో వస్తుంది. ఎంటీ కలిగిన పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 22.35 కిలోమీటర్లు, ఏఎంటీతో ఉన్న కార్లు 22.94 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సీఎన్జీ ఆధారిత వర్షన్‌ కిలోకు 30.61 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని చెప్పింది. ధరల పెరుగుదల డెల్టా ఏజీస్‌, జీటా ఏజీఎస్, ఆల్ఫా ఏజీఎస్‌ వేరియంట్లపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మోటార్‌ నిపుణులు అంటున్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)