Breaking News

బజాజ్‌ ఆటో మాజీ వైస్‌ ఛైర్మన్‌ కన్నుమూత

Published on Sat, 04/12/2025 - 09:22

బజాజ్‌ ఆటో మాజీ వైస్‌ ఛైర్మన్‌ మాధుర్‌ బజాజ్‌(73) మృతి చెందారు. వృద్ధాప్య కారణాల వల్ల అస్వస్థతతో ఇటీవల దక్షిణ ముంబైలో ఉన్న బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతుండగానే శుక్రవారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కారణంగా గతేడాది జనవరిలో బజాజ్‌ ఆటో వైస్‌ ఛైర్మన్‌ పదవికి మాధుర్‌ రాజీనామా చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు జమ్నాలాల్ బజాజ్ మనవడు మాధుర్ బజాజ్‌. విదేశాల్లో విద్యనభ్యసించిన ఆయన గ్రూప్‌లోని పలు కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్)తో పాటు సీఐఐ, ఇతర పారిశ్రామిక సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇదీ చదవండి: డాలర్‌కు ట్రంప్‌ గండం

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు భారత వృద్ధిలో భాగస్వామ్యం అయ్యారంటూ బజాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబ స్నేహితుడు కన్నుమూశారని విచారం వ్యక్తం చేస్తూ భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కళ్యాణి సంతాపం తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (వెస్ట్రన్ రీజియన్) ఛైర్మన్‌గా, చాంబర్ ఆఫ్ మరాఠ్వాడా ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడిగా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌తో భాగస్వామిగా ఆయన ఎంతో సేవలందించారని బాబా కళ్యాణి తెలిపారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)