Breaking News

సెప్టెంబర్‌ నుంచి బజాజ్‌ ఎలక్ట్రిక్ చేతక్‌ డెలివరీలు

Published on Thu, 07/01/2021 - 14:31

ముంబై: అటో దిగ్గజం బజాబ్‌ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్లు "చేతక్‌" డెలివరీలను సెప్టెంబర్‌ నుంచి చేపట్టాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ 2020-21 వార్షిక నివేదికలో తెలిపింది. ఈ-స్కూటర్‌ చేతక్‌ ప్రీమియం, చేతక్‌ అర్బన్‌ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. అర్బన్‌ వేరియంట్ ధర రూ.1,22,000(ఎక్స్-షోరూమ్)కాగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.1,26,000 (ఎక్స్-షోరూమ్). అలాగే వచ్చే మూడు నెలల్లో ఇతర మెట్రో నగరాల్లో బజాజ్ చేతక్ సేవలు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఐపీ6 వాటర్‌ రెసిస్టెన్స్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీని అమర్చారు. ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే ఎకో మోడ్‌లో 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 

2020 మొదట్లోనే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ సంబంధిత సమస్యలతో అప్పట్లో బుకింగ్స్‌ నిలిపేశారు. తిరిగి ఈ ఏప్రిల్‌ 18న ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో రీ-ఓపెన్‌ చేశారు. భారీ డిమాండ్‌ నేపథ్యంలో వెంటనే నిలిపేశారు. ఇతర కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి వీలుగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.  త్వరలోనే మళ్లీ సప్లై వంటి అంశాలను సమీక్షించి బుకింగ్ తెరిచేలా నిర్ణయం తీసుకుంటామని బజాజ్ ఆటో ప్రకటించింది.

చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్​ వాడితే మీ అకౌంట్ బ్లాక్

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)