Breaking News

రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ కోసం కొత్త ప్లాన్‌

Published on Wed, 02/19/2025 - 14:45

బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారంటీడ్ పెన్షన్ గోల్ 2 అనే కొత్త రిటైర్మెంట్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ను పదవీవిరమణ సమయంలో నిర్దిష్టమైన రాబడులు వచ్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్‌లో ఈ తరహా రిటైర్‌మెంట్‌ ప్లాన్లు చాలా కంపెనీలు అందిస్తున్నాయి. ఇటువంటి పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసేముందు పాలసీదారులు అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బజాన్‌ కొత్త పథకంలోకి కీలక అంశాలు కింది విధంగా ఉన్నాయి.

దీర్ఘకాల వాయిదా: ఈ ప్రత్యేక ఫీచర్ 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న వ్యక్తులు తమ ఆర్థిక భవిష్యత్తును ముందుగానే నిర్ణయించుకునేందుకు తోడ్పడుతుంది. వాయిదా వ్యవధిని 30 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఇది పొదుపు పెరగడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది.

మల్టిపుల్ యాన్యుటీ పేఅవుట్ ఆప్షన్లు: ఈ ప్లాన్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీ, రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ (ఆర్ఓపీ) ఎంపికలతో సహా వివిధ యాన్యుటీ చెల్లింపు సదుపాయాలను అందిస్తుంది. ఇవి వ్యక్తిగత రిటైర్మెంట్ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా ఉంటాయి.

కస్టమైజబుల్ ఆర్ఓపీ: పాలసీదారులు కొనుగోలు ధర 50% నుంచి 100% రాబడిని ఎంచుకోవచ్చు. ఇది యాన్యుటీ చెల్లింపులను పెంచుతుంది.

గ్యారంటీడ్ లైఫ్ టైమ్ ఇన్ కమ్: రిటైర్‌మెంట్‌ సమయంలో స్థిరమైన ఆదాయాన్ని ఇది నిర్ధారిస్తుంది.

ఇదీ చదవండి: అదానీపై ఫిర్యాదుకు ప్రభుత్వ సాయం కోరిన ఎస్‌ఈసీ

ఈ సందర్భంగా బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈఓ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. జీవన ప్రమాణాలు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పదవీ విరమణ తర్వాత చాలాఏళ్లు జీవిస్తున్నారని చెప్పారు. కానీ సరైన ప్రణాళికలేక రిటైర్‌మెంట్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ను తీసుకోవాలని పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)