Breaking News

మణప్పురంలో బెయిన్‌కు వాటా

Published on Sat, 03/22/2025 - 04:21

న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం బెయిన్‌ క్యాపిటల్‌ బంగారంపై రుణాలందించే మణప్పురం ఫైనాన్స్‌లో 18 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 4,385 కోట్లు వెచ్చించనుంది. తద్వారా గోల్డ్‌ లోన్‌ కంపెనీ ప్రమోటర్‌ సంస్థలలో ఒకటిగా అవతరించనుంది. దీంతో నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒక్కో షేరుకి రూ. 236 చొప్పున ధర నిర్ధారించింది. ఇందుకు మరో రూ. 5,764 కోట్లు కేటాయించనుంది. వెరసి విసర్తించిన తదుపరి మణప్పురం ఫైనాన్స్‌ చెల్లించిన మూలధనంలో 41.7 శాతానికి బెయిన్‌ వాటా బలపడనుంది.

6 నెలల సగటు ధర 
ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో బెయిన్‌కు ఈక్విటీతోపాటు.. వారంట్లను మణప్పురం కేటాయించనుంది. గత ఆరు నెలల సగటు ధరకంటే 30% అధిక(ప్రీమియం) ధరతో వీటిని జారీ చేయనుంది. వీటితో విస్తరించనున్న కంపెనీ ఈక్విటీలో బెయిన్‌కు 18% వాటా లభించనుంది. తద్వారా మణప్పురం ఫైనాన్స్‌లో సహప్రమోటర్‌ కానుంది. దీంతో వారంట్లు మినహా మిగిలిన ఈక్విటీ నుంచి సాధారణ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆఫర్‌ పూర్తిగా విజయవంతమైతే బెయిన్‌ వాటా వారంట్ల మారి్పడి తదుపరి 41.7%కి బలపడనుంది. ఇదే సమయంలో ప్రస్తుత ప్రమోటర్ల వాటా 28.9 %కి చేరనుంది. అయితే ఈ లావాదేవీలకు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది.  

1949లో ఆవిర్భావం: ఎన్‌బీఎఫ్‌సీ.. మణప్పురం ఫైనాన్స్‌ 1949లో కేరళలో ఏర్పాటైంది. 5,357 బ్రాంచీలుసహా 50,795 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బంగారు ఆభరణాలపై రుణాలు అందిస్తూ మైక్రో, వాహన, గృహ, ఎస్‌ఎంఈ ఫైనాన్స్‌లోకి సైతం విస్తరించింది.

షేరు 8 శాతం జూమ్‌...
సాధారణ వాటాదారులకు బెయిన్‌ క్యాపిటల్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించిన నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్‌ షేరు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేరు 7.7 శాతం జంప్‌చేసి రూ. 234 వద్ద ముగిసింది. ఒక దశలో 14 శాతం దూసుకెళ్లి రూ. 248కు చేరింది. ఇది 52 వారాల గరిష్టం. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)