2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!

Published on Fri, 02/21/2025 - 08:40

సేవల రంగం తోడ్పాటుతో భారత్‌ 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుందని ఒక నివేదిక అంచనా వేసింది. అప్పటికి జీడీపీ 23–35 ట్రిలియన్‌ డాలర్లకు (రూ.1,978–3,010 లక్షల కోట్లు) చేరుకుంటుందని తెలిపింది. దేశ జీడీపీలో సేవల రంగం వాటా 60 శాతంగా, తయారీ రంగం వాటా 32 శాతం మేర ఉంటుందని పేర్కొంది. ఈ నివేదికను బెయిన్‌ అండ్‌ కంపెనీ, నాస్కామ్‌ సంయుక్తంగా రూపొందించాయి.

‘రానున్న దశాబ్దాల్లో 20 కోట్ల మంది శ్రామికశక్తి అందుబాటులోకి వస్తారు. అధిక విలువ ఉద్యోగాలను కల్పించే వినూత్నమైన అవకాశం భారత్‌ ముందుంది. తద్వారా గణనీయమైన ఆర్థిక సామర్థ్యాలను వెలికితీయగలదు. ఇందుకు రంగాలవారీ టెక్నాలజీపరమైన కార్యాచరణ అవసరం. ఏఐ ఆధారిత చిప్‌ డిజైన్, విడిభాగాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను పెంచుతాయి. దీనివల్ల ఎగుమతుల్లో తయారీ వాటా 24 శాతం నుంచి 2047 నాటికి 45–50 శాతానికి చేరుకుంటుంది’ అని ఈ నివేదిక వివరించింది. అలాగే ఆటో విడిభాగాల ఎగుమతులు 200–250 బిలియన్‌ డాలర్లు చేరుకోవచ్చని అంచనా వేసింది.  

ఇదీ చదవండి: ఈ–కామర్స్‌ దూకుడు

ఐదు కీలక రంగాలు..

అంతర్జాతీయంగా నెలకొన్న ధోరణులు, విస్తృతమైన అవకాశాల దృష్ట్యా.. ఎలక్ట్రానిక్స్, ఇంధనం, కెమికల్స్, ఆటోమోటివ్, సేవలు భారత్‌కు వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఈ నివేదిక తెలిపింది. పెరిగే ఆదాయం, నైపుణ్య కార్మికులు, మౌలిక వసతుల కల్పన ఈ వృద్ధికి నడిపిస్తాయని పేర్కొంది.
 

#

Tags : 1

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)