Breaking News

బీమాకు జీఎస్‌టీ సంస్కరణల జోష్‌

Published on Tue, 12/30/2025 - 08:44

జీవిత బీమాపై జీఎస్‌టీని తొలగించిన నేపథ్యంలో పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని యాక్సిస్‌ మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో సుమీత్‌ మదన్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 22 (మార్పులు అమల్లోకి వచ్చిన రోజు) తర్వాత నుంచి, దీపావళి రెండు మూడు రోజులు మినహాయిస్తే, వారం వారీగా 30–35 శాతం విక్రయాల వృద్ధి కనిపించిందని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్‌ అనంతరం బీమాపై అవగాహన, పాలసీల కొనుగోళ్లు పెరిగాయని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి సుమిత్‌ చెప్పారు. క్లెయిమ్‌ సెటిల్మెంట్లు మెరుగ్గా ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని తెలిపారు. మరోవైపు, జెనరేషన్‌ జెడ్‌ కూడా బీమాపై ఆసక్తి చూపుతోందని వివరించారు. సౌకర్యవంతంగా డిజిటల్‌ మాధ్యమంతో పాటు సంప్రదాయ బ్యాంకెష్యూరెన్స్‌ మాధ్యమం ద్వారా కూడా కొనుగోళ్లు చేస్తోందని పేర్కొన్నారు. అయితే, పరిశ్రమ నిర్వహిస్తున్న ప్రచార కార్కక్రమాలు, ఇతరత్రా కారణాలతో కూడా బీమాపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, అది ఆచరణలో (పూర్తి స్థాయిలో పాలసీల కొనుగోళ్ల రూపంలో) కనిపించేందుకు మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉందన్నారు.  

తగినంత కవరేజీ కూడా ముఖ్యం..

బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, తగినంత కవరేజీ తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని సుమిత్‌ చెప్పారు. చాలా మంది దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని వివరించారు. పరిస్థితులను బట్టి వార్షికాదాయానికి పది నుంచి పదిహేను రెట్లు కవరేజీ ఉండటం శ్రేయస్కరమని పేర్కొన్నారు. పాలసీదారులకు మరింత చేరువయ్యే క్రమంలో తమ ప్రక్రియల్లో కృత్రిమ మేథ (ఏఐ)ని కూడా వినియోగిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థకు సంబంధించి దాదాపు 64 శాతం అండర్‌రైటింగ్‌ ఏఐతోనే జరుగుతోందని సుమిత్‌ వివరించారు. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడమనేది బీమా రంగానికి ప్రయోజనకరమేనని ఆయన చెప్పారు. దీనితో పోటీ పెరిగి, అంతిమంగా కస్టమర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)