Breaking News

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం డౌన్‌

Published on Fri, 07/18/2025 - 00:40

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 6,244 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 4 శాతం క్షీణించి రూ. 5,806 కోట్లకు పరిమితమైంది. 

మొండి బకాయిలు, లోన్‌ అప్‌గ్రేడ్‌ విధానాలలో మార్పులు  మొత్తం ఫలితాలపై ప్రభావం చూపినట్లు బ్యాంక్‌ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,034 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 35,844 కోట్ల నుంచి రూ. 38,322 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం రూ. 30,061 కోట్ల నుంచి రూ. 31,064 కోట్లకు పుంజుకుంది. నికర వడ్డీ ఆదాయం 1 శాతం నామమాత్ర వృద్ధితో రూ. 13,560 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.05 శాతం నుంచి 3.8 శాతానికి నీరసించాయి.  

ఎన్‌పీఏలు పెరిగాయ్‌.. 
క్యూ1లో యాక్సిస్‌ బ్యాంక్‌ నిర్వహణ లాభం రూ. 10,106 కోట్ల నుంచి రూ. 11,515 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.28 శాతం నుంచి 1.57 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.34 శాతం నుంచి 0.45 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 2,039 కోట్ల నుంచి రూ. 3,948 కోట్లకు భారీగా ఎగశాయి. స్థూల స్లిప్పేజీలు రూ. 4,805 కోట్ల నుంచి రూ. 8,200 కోట్లకు భారీగా పెరిగాయి. అయితే టెక్నికల్‌ ప్రభావాన్ని సర్దుబాటు చేస్తే రూ. 5,491 కోట్లుగా నమోదైనట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో అమితాబ్‌ చౌదరీ పేర్కొన్నారు. కనీస మూలధన నిష్పత్తి 17.07 శాతం నుంచి 16.85 శాతానికి నీరసించింది.  

 ఫలితాల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 1,160 వద్ద ముగిసింది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)