Breaking News

జనరేటివ్‌ ఏఐ స్టార్టప్‌లకు ఏడబ్ల్యూఎస్‌ సాయం!

Published on Sat, 06/15/2024 - 14:40

జెనరేటివ్‌ ఏఐ స్టార్టప్‌లకు అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ (ఏడబ్ల్యూఎస్‌) సహకారం అందించనున్నట్లు తెలిపింది. జెనరేటివ్‌ ఏఐ విభాగంలో సేవలందించే స్టార్టప్‌ కంపెనీలకు ఏకంగా 230 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సాయం చేయాలని నిర్ణయించుకుంది.

ఏడబ్ల్యూఎస్‌ అంతర్జాతీయంగా జెనరేటివ్‌ ఏఐ యాక్సిలరేటర్‌ కార్యక్రమాన్ని విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రంగంలో సేవలందించే అంకురాలకు ఆర్థికసాయం చేయలని నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి 10 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 80 వ్యవస్థాపకులు, అంకుర సంస్థలకు సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఆసియా పసిఫిక్, జపాన్‌ ప్రాంతం నుంచే 20 వరకు ఉండనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. 

ఈ సంస్థల వృద్ధిని పెంచడమే ఈ నిధుల సహకారం ప్రధానం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఒక్కో జెన్‌ఏఐ స్టార్టప్‌కు 1 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) మేర ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు. దాంతోపాటు ఏడబ్ల్యూఎస్‌ తరఫున ఆయా కంపెనీలకు నైపుణ్యాభివృద్ధి సెషన్‌లు, వ్యాపారం, సాంకేతికత అంశాలపై సలహాలు, నెట్‌వర్కింగ్‌ అవకాశాలు తదితర సహకారాన్ని అందిస్తామని ఏడబ్ల్యూఎస్‌ పేర్కొంది.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)