Breaking News

అవీవా లైఫ్‌ నుంచి కొత్త టర్మ్‌ ప్లాన్‌

Published on Fri, 01/09/2026 - 14:25

అవీవా ఇండియా ‘అవీవా స్మార్ట్‌ వైటల్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. ఇది నాన్‌ లింక్డ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్‌. అంటే జీవిత బీమాకు రణ కల్పించే అచ్చమైన స్థిర ప్రయోజన పాలసీ. కనీసం రూ.10 లక్షల నుంచి బీమా రక్షణ మొదలవుతుంది. 49 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) ఏదేనీ బారిన పడి, 15 రోజుల పాటు జీవించి ఉంటే ఈ ప్లాన్‌లో రూ.10/15/20 లక్షలు ఒకే విడత ప్రయోజనం అందిస్తారు.

పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. రోజువారీ నడక ద్వారా ఇందులో రివార్డులు జమ చేసుకోవచ్చు. వీటి ద్వారా బీమా రక్షణను రెండు రెట్లకు పెంచుకోవచ్చు. రూ.20–50 ఏళ్ల మధ్య వయసు వారు పాలసీని 10–15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు.

ఇందులో ప్రీమియం చెల్లింపునకు వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలవారీ వంటి సౌకర్యవంతమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ కాలంలో బీమాదారు మరణిస్తే నామినీకి ముందుగా నిర్ణయించిన సమ్‌ అష్యూర్డ్‌ను చెల్లిస్తారు. అవసరమైతే అదనపు రైడర్లను కూడా జత చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని వయసు, బీమా కాలం, ఎంచుకున్న కవరేజ్‌ ఆధారంగా నిర్ణయిస్తారు.

పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ ప్లాన్‌ ఉపయోగకరంగా ఉంటుంది. వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ప్రీమియంపై మినహాయింపులు, క్లెయిమ్‌ మొత్తంపై పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య సంబంధిత ప్రమాదాలకు రక్షణ కోరుకునే వారికి ఈ ప్లాన్‌ సరైన ఎంపికగా అవీవా ఇండియా పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)