Breaking News

EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!

Published on Tue, 04/01/2025 - 18:29

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాలని యోచిస్తోంది. ఇదే జరిగితే.. 7.5 కోట్ల కంటే ఎక్కువ ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ది చేకూరుస్తుంది.

గత వారం జరిగిన సమావేశంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి 'సుమితా దావ్రా' ఈ పరిమితిని పెంచే ప్రతిపాదనను ఆమోదించారు. అయితే ఈ సిఫార్సును ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదం కోసం సమర్పించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత ఈపీఎఫ్ఓ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా రూ. 5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ మోడ్‌ను ఏప్రిల్ 2020లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి వైద్య ఖర్చుల కోసం, విద్య, వివాహం, గృహనిర్మాణం వంటి వాటి కోసం అడ్వాన్స్‌గా నగదు తీసుకునేందుకు అవకాశం లభించింది. అయితే మే 2024లో ఆటో అప్రూవ్డ్ క్లెయిమ్‌ల పరిమితిని రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచారు. ఆ తరువాత చాలామంది దీనిని ఉపయోగించుకున్నారు.

ఇదీ చదవండి: ఈ రూల్ అతిక్రమిస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్!: నితిన్ గడ్కరీ

మార్చి 6, 2025 నాటికి 2.16 కోట్ల ఆటో క్లెయిమ్‌లు ప్రాసెస్ చేయబడ్డాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే  95 శాతం ఆటో మోడ్ క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి. తిరస్కరణ రేటు 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గింది.

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)