Breaking News

నెమ్మదించిన ఆటో అమ్మకాలు: కంపెనీలకు షాక్‌

Published on Wed, 08/02/2023 - 11:26

ముంబై: దేశీయంగా ఆటో అమ్మకాలు జూలైలో నెమ్మదించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్స్‌ కంపెనీల విక్రయాలు ఒక అంకె వృద్ధికి పరిమితమయ్యాయి. మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం జూలైలో మొత్తం 1,75,916 వాహనాలను విక్రయించగా, జూలైలో ఈ సంఖ్య స్వల్పంగా 3% పెరిగి 1,81,630 యూనిట్లకు చేరింది. ‘‘ఈ జూలైలో మా ఎస్‌యూవీ అమ్మకాలు 42,620 యూనిట్లు. కేరళ ఓనమ్‌ పండుగ(ఆగస్టు 28)తో ప్రారంభం కానున్న పండుగ సీజన్‌ నుంచి ఆటో పరిశ్రమ అమ్మకాల్లో వృద్ధి ఆశించవచ్చు’’ అని కంపెనీ మార్కెటింగ్‌  సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

♦ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఈ జూలైలో 66,701 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే ఏప్రిల్‌లో అమ్మిన 63,851 వాహనాలతో పోలిస్తే నాలుగు శాతం అధికం. ‘‘స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌(ఎస్‌యూవీ) వాహనాలకు డిమాండ్‌ లభించడంతో జూలైలో దేశీయంగా 60 వేలకు పైగా అమ్మకాలను సాధించగలిగాము’’ అని కంపెనీ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. 
♦ టాటా మోటార్స్‌ స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది జూలైలో 81,790 వాహనాలకు విక్రయించగా.., ఈ జూలైలో నాలుగుశాతం క్షీణతతో 80,633 యూనిట్లకు పరిమితమయ్యాయి.  
♦మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాల్లో 18% వృద్ధి సాధించింది. గతేడాది జూలైలో మొత్తం 56,148 యూనిట్లకు విక్రయించగా, ఈ జూలైలో 66,124 వాహనాలను అమ్మింది. ముఖ్యంగా ప్యాసింజర్‌ విభాగంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది.  
♦ ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్‌ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. బజాజ్‌ ఆటో(10% క్షీణత) మినహా రాయల్‌ ఎన్‌ఫీల్డ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్‌ మోటార్స్‌ అమ్మకాలు వరుసగా 32%, 12%, 4% చొప్పున పెరిగాయి.   
♦ మొత్తంగా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 3% స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. ఈ జూలైలో వీటి విక్రయాలు 3,52,492 యూనిట్లకు చేరాయి. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?